Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Bhuma: చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయండి

Bhuma: చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయండి

కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొనండి

ఈనెల ఎనిమిదో తేదీన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తుకు గ్యారెంటీ – ఇది బాబు గ్యారెంటీ కార్యక్రమానికి నంద్యాల పర్యటనకు వస్తున్న సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నంద్యాల పట్టణ, నంద్యాల మండల, గోస్పాడు మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జీలు, టిడిపి నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో శుక్రవారం జరిగే చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని, పట్టణంలోని గాంధీ చౌక్ లో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు బహిరంగ సభ ఉంటుందని, రాత్రి ఆర్కే ఫంక్షన్ హాల్ నందు రాత్రి బస చేసి శనివారం ఉదయం బిసిల సభ, నాయకులు, కార్యకర్తలతో పరిచయ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. చంద్రబాబు పర్యటనకు పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News