కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి అతిధిగా గోవా పిసిసి ప్రెసిడెంట్ అమిత్ పాట్కర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ
బి ఆర్ ఎస్ అనగా బ్రస్టాచర్ రాజ్యసమితి అని అన్నారు. జుక్కల్ నియోజకవర్గానికి టెక్స్టైల్ పార్క్, వుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, అన్ని మండలాల బస్టాండ్లకు రూపురేఖలు మారుస్తానన్న షిండే కనీసం బస్టాండ్లను కూర్చోవడానికి కుర్చీలు కనీసం టాయిలెట్లు కూడా ఏర్పాట్లు చేయలేదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలలో సరైన సిబ్బంది మరియు డాక్టర్లు లేక రోగులు జిల్లా ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని ఆయన అన్నారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌధగర్ గంగారం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసేదే చెప్తుంది చెప్పిందే చేస్తుంది పేదలకు ఇల్లు, భూములు పంపిణీ, పెన్షన్లు ఆరోగ్యశ్రీ వంటి పథకాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. అలాగే తన జీవితంలో కేసీఆర్ అంత జూట ముఖ్యమంత్రిని ఇప్పటివరకు చూసిందే లేదన్నారు. అనంతరం సోనియాగాంధీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ లను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సోనియాగాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలను గ్యారెంటీగా అమలు చేస్తామని అన్నారు 1) మహాలక్ష్మి పథకం 2) రైతు భరోసా 3) యువ వికాసం 4) ఇందిరమ్మ ఇండ్లు 5) గృహజ్యోతి 6) చేయూత పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ డెలికేట్ విట్టల్ రెడ్డి, మల్లికార్జున్ అప్ప శెట్కార్, కామారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ గజానంద్ పటేల్, జుక్కల్ జడ్పీటీసీ దాదారావు పటేల్, మేనూర్ సర్పంచ్ విట్టల్ గురూజీ, ప్రచార కమిటీ అధ్యక్షులు సౌదగర్ అరవింద్, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, యూత్ పార్టీ అధ్యక్షులు, అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.