Saturday, May 18, 2024
Homeపాలిటిక్స్Big shock to BRS: బీఆర్ఎస్ కు మళ్లీ బిగ్ షాక్

Big shock to BRS: బీఆర్ఎస్ కు మళ్లీ బిగ్ షాక్

రాథోడ్ బాపూరావ్ కాంగ్రెస్ లోకి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. విపక్ష పార్టీకి చెందిన మాజీలు, సిట్టింగులు అందరూ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు పోటీ పడుతుండగా తాజాగా ఈ లిస్టులోకి చేరారు మరో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే.

- Advertisement -

బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ జి. ఈశ్వర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు రాజ్ మహమ్మద్, రవీందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దీంతో మరోమారు గులాబీ పార్టీకి పెద్ద షాక్ తగిలినట్టైంది.

జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసంలో ఈ చేరికలు సాగగా, వీరందరికీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News