Friday, April 4, 2025
Homeపాలిటిక్స్BJYM: దేశ సరిహద్దు గ్రామాల్లో 'విలేజ్ సంపర్క్ యాత్ర'

BJYM: దేశ సరిహద్దు గ్రామాల్లో ‘విలేజ్ సంపర్క్ యాత్ర’

భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో విలేజ్ సంపర్క్ యాత్ర కార్యక్రమాలు భారీ ఎత్తున ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సలహా మేరకు బీజేవైఎం ఆధ్వర్యంలో గ్రామబాట పట్టనుంది పార్టీ యువజన విభాగం. జనవరి 20నుంచి పార్టీలోని యువ కార్యకర్తలు గుజరాత్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, అస్సాం, త్రిపురా వంటి రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాలకు గడపగడపకూ వెళ్లి సామాన్యులతో మమేకం కానున్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో గత 9 ఏళ్లుగా సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వీరు పర్యవేక్షించనున్నారు.

- Advertisement -

సరిహద్దుల్లోని యువతతో పలు సమస్యలు, అంశాలపై బీజేవైఎం నేతలు చర్చా గోష్టి నిర్వహిస్తున్నారు. దేశ సరిహద్దుల్లోని గ్రామాల వాణిని వినాలన్న మోడీ సూచలనలు తాము అమలు చేయబోతున్నట్టు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News