వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని..ఖమ్మం జిల్లాలోని పదికి పది స్థానాలలో బీఆర్ఎస్ అఖండ విజయం సాధించడం ఖాయని పువ్వాడ అజయ్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ సభతో.. జిల్లాలో బీజేపీకి ఏ మాత్రం స్థానం లేదని తేలిపోయిందని వారన్నారు. ఖమ్మం సభలో ఎంత మంది జనాలు ఉన్నారో బయట కూడా అంతేమంది ఉన్నారని.. తమ అంచనాలకు మించి ప్రజలు తరలివచ్చినట్టు, బీఆర్ఎస్ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని వారు హర్షం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ దేశంలో ప్రభలమైన రాజకీయ శక్తిగా అవతరించడానికి ఖమ్మం సభ దోహదపడుతుందన్నారు. తాము అడగ్గానే ఖమ్మంలో బీఆర్ఎస్ మొట్టమొదటి బహిరంగసభ పెట్టేందుకు అనుమతిచ్చిన పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు మంత్రి పువ్వాడ, ఎంపీ వద్దిరాజు.