Monday, May 19, 2025
Homeపాలిటిక్స్BRS fire on BJP: మోడీ ఫేక్, సంజయ్ ఫేక్, అరవింద్ ఫేక్..

BRS fire on BJP: మోడీ ఫేక్, సంజయ్ ఫేక్, అరవింద్ ఫేక్..

విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తూ బీజేపీ పేపర్ లీకేజీలకు పాల్పడుతోందంటూ రైతు బంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పియూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి ఆరోపించారు.  తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పేపర్ లీకేజీ కాలేదని వారు గుర్తుచేశారు.  బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉపాధ్యాయ సంఘాలతో కుమ్మక్కు అయ్యి తెలుగు పేపర్ ను లీక్ చేశారని, బీజేపీ బొక్కలకు కొంతమంది ఆశ పడుతున్నారని వారన్నారు. 

- Advertisement -

కేంద్ మంత్రి కిరణ్ రిజిజు జడ్జీలపై ఏం మాట్లాడారో అందరికి తెలుసని, బీజేపీ లీగల్ టీమ్ బండి సంజయ్ బెయిల్ కోసం బెదిరించే ప్రయత్నం చేశారని వారు ఆరోపించారు.  10వ తరగతి పరీక్ష పేపర్ లీకేజీనే కానప్పుడు విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని బండి సంజయ్ ఎందుకు అంటున్నారని వారు నిలదీశారు.  ప్రయివేటు యూనివర్సిటీలకు వ్యతిరేకం అని చెప్తున్న బండి సంజయ్ తన కుమారుడిని మహేంద్రా యూనివర్సిటీలో చదివిస్తాడని, బండి సంజయ్ ను తరుణ్ చుగ్,సునీల్ బన్సల్,జేపీ నడ్డా ఎందుకు పొగుడుతున్నారో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.  బీజేపీ నేతలు ఎవరు చదువుకోలేదని, మోడీ ఫేక్…సంజయ్ ఫేక్…అరవింద్ ఫేక్, నలుగురు బీజేపీ ఎంపిలను గెలిపిస్తే నాలుగు బొగ్గు బ్లాకులను అమ్ముతున్నారని వారు ఆరోపించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News