మాజీ గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. దీంతో ఇప్పటికీ మాజీ గవర్నర్ తమిళిసై పైన కేసీఆర్ అండ్ కోకు కోపం పోలేదని స్పష్టమవుతోంది. సికింద్రాబాద్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి జి .కిషన్ రెడ్డికి మద్దతుగా హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కాలనీలో ప్రచారం చేసిన తమిళిసై అయోధ్య రామమందిర నమూనాలను ఓటర్లకు పంచడంపై బీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది. ఇదంతా ఎన్నికల నియమావళి ఉల్లంఘించడమేనని, ఆమెపై చర్యలు తీసుకోవాలని బీ ఆర్ ఎస్ తన వినతి పత్రంలో కోరింది. కాగా తెలంగాణ గవర్నర్ గా ఉన్న సమయంలో తనకు ప్రజలకు మధ్య కేసీఆర్ సర్కార్ దూరం పెంచిందని తమిళిసై ఆరోపించటం సంచలనం సృష్టించింది.

