Monday, June 24, 2024
Homeపాలిటిక్స్CM Revanth on industrial development: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలి

CM Revanth on industrial development: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడాలి

ప్రపంచ దేశాల్లో ది బెస్ట్ పాలసీలు..

పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీపడేలా విధానాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించి అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన నూతన విధానాలపై పలు సూచనలు చేశారు. గత సమీక్షా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగతికి సంబంధించిన వివరాలను అధికారులు సీఎం కు వివరించారు. టెక్స్ టైల్స్ కు సంబంధించి రాష్ట్రంలోని పవర్ లూమ్, హ్యాండ్ లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.

- Advertisement -

పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కొత్తగా ఆరు పాలసీలను రూపొందించనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఎంఎస్ఎంఈ పాలసీ, ఎక్స్ పోర్ట్ పాలసీ, న్యూ లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీలను రూపొందిస్తుమన్నామని సీఎంకు వివరించారు. ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక పాలసీలను పూర్తిస్థాయిలో రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రపంచ దేశాల్లో ది బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News