నారాయణ పేట జిల్లా కోస్గీ మండలం చంద్రవంచ గ్రామంలో ప్రజాపాలన పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్. గ్రామ లబ్దిదారులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులను అందజేసిన ముఖ్యమంత్రి. చంద్రవంచ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రజా ప్రతినిధులు.
నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాలకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించింది. నారాయణపేట జిల్లా కోస్గి (M) చంద్రవంచ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ సంక్షేమ పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.