రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా చేరికలు సాగుతుండటంతో..ఇక్కడి రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతూ, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రామగుండంలో
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా స్థానిక 12వ డివిజన్ పరిధిలోని గోదావరిఖని విఠల్ నగర్ ప్రాంత వాసులు కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కుంట సది ఆధ్వర్యంలో దాదాపుగా 200 మందికి పైగా పార్టీలో చేరారు.
ఈ మేరకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ సమక్షంలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో అవినీతిమయమైన బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయి, తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీ ఋణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, రాబోయే ఎన్నికల్లో రామగుండంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, ఎస్సీ సెల్, బిసి సెల్ ,మైనారిటీ ,మహిళ, యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ శ్రేణులు, సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు.
Congress: BRS, BJPలకు భారీ షాక్
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు