Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Congress: శ్రీనివాస్ గౌడ్ అవినీతిపై పూర్తి ఆధారాలున్నాయి

Congress: శ్రీనివాస్ గౌడ్ అవినీతిపై పూర్తి ఆధారాలున్నాయి

మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూ కబ్జాలపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం

మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూ కబ్జాల మీద బహిరంగ చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్దమని, ఉమ్మడి పాలమూరులో బిఆర్ఎస్ కు కాలం చెల్లిందని, ఉమ్మడి జిల్లాలో 14 కు 14 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జి. మధుసూధన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు జి. మధుసూధన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు…మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరియు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేసిన వాక్యాల్లో ఎలాంటి తప్పు లేదని, ఉమ్మడి జిల్లాలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన భూకబ్జాలపై పూర్తి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, పూర్తి ఆధారాలతోనే రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారని ఈ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ బహిరంగ చర్చకు సిద్ధంగా ఉందని జిఎంఆర్ పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కట్టిన కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ వద్ద నీళ్లు వదులుతూ కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లలో ఏమి చేయలేదని ప్రగల్భాలు పలకడం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కోయిల్ సాగర్ ద్వారా చివరి ఆయికట్టు వరకు రైతాంగానికి రెండు పంటలకు నీరంధించిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు.

- Advertisement -


మేము కట్టిన ప్రాజెక్ట్ లో పూలు చల్లి, నీళ్లు వదిలి, మమ్మల్ని విమర్శించడం ఎమ్మెల్యే సిగ్గులేనితనానికి నిదర్శనం అన్నారు.మమ్మల్ని విమర్శించే స్థాయి అర్హత వెంకటేశ్వర రెడ్డికి లేదన్నారు. చెక్ డ్యామ్ లు అంటూ చెప్పుకోవడం తప్ప వెంకటేశ్వర్ రెడ్డి చేసింది ఏమి లేదని,, చెక్ డ్యామ్ ల నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డవన్న విషయం దేవరకద్ర నియోజకవర్గ ప్రజానీకానికి మొత్తం తెలుసని, రాబోయే ఎన్నికల్లో వెంకటేశ్వర్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పడానికి దేవరకద్ర నియోజకవర్గ ప్రజలు ఆతృతతో ఎదురుచూస్తున్నారని జియంఆర్ పేర్కొన్నారు.ఈ సమావేశం లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ , టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంతా రాఘవేంద్ర రాజు, జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ లింగం నాయక్, భూత్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కేశిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, భూత్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు లిక్కి విజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News