తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ బిఆర్ఎస్ తో కమ్యూనిస్టుల పొత్తు ఖాయమైనట్లు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బండి రమేష్ తెలిపారు. పాలేరు అసెంబ్లీ స్థానానికి బిఆర్ఎస్ పొత్తుతో సిపిఎం పార్టీ పోటీ చేయబోతుందని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి బండి రమేష్, తెలిపారు. మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు సైనికులా పనిచేయాలని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్ తో కలిసి పని చేస్తున్నామని పాలేరులో బిఆర్ఎస్ మద్దతుతో సిపిఎం పార్టీ పోటీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కార్యకర్తలు నాయకులు సైనికులుగా పనిచేసి ఇంటింటికి ప్రచారం చేయాలని ఆయన సూచించారు కొంతమంది జీర్ణించుకోలేని నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని వాటిని ఎవరు నమ్మొద్దని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి కొమ్ము .శీను,సీనియర్ నాయకులు రావుల వెంకట్రామిరెడ్డి ,మండల కార్యవర్గ సభ్యులు వెంకట్రావు ,మండల కమిటీ సభ్యులు పప్పుల. ప్రసాద్, ఉపేందర్ రెడ్డి, సైదులు ,ఇప్పల.పుష్పవతి, మద్దిల. శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ అంగడి. వీరస్వామి, కెవిపిఎస్ మండల కార్యదర్శి నాగడ. సురేష్ ,సోషల్ మీడియా కన్వీనర్ పాపారావు , ముత్తయ్య ,దొండేటి.నిర్మలరావు, రమణబోయిన. రవి,వివిధ గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.