సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం మునిపల్లి మండలో ఆయా గ్రామాల్లో, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ..తమ పథకాలనే అధికారపక్షం కాపీ కొట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు సాధ్యం కావంటున్న అధికార పార్టీ మరి తమ పథకాలెలా అమలుచేస్తారని నిలదీశారు. కాంగ్రెస్ అంటే ప్రజల పార్టీ అని.. ఎన్నికల ప్రచారంలో క్యాడర్ లో కొత్త జోష్ నింపుతున్నారు దామోదర్.

