Saturday, September 28, 2024
Homeపాలిటిక్స్Deputy CM Pawan Kalyan Jana Darbar: ఉప ముఖ్యమంత్రి ‘జన దర్బార్’

Deputy CM Pawan Kalyan Jana Darbar: ఉప ముఖ్యమంత్రి ‘జన దర్బార్’

• జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ప్రజా సమస్యలు వినేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్
• శనివారం మధ్యాహ్నం బాధితుల సమస్యలను నేరుగా విన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ప్రతిపక్షంలో ఉన్నా… అధికారపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయడమే తన మొదటి ప్రాధాన్యం అని పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించారు. సమస్యలతో ఉన్న ప్రజలు తనను కలుసుకునేందుకు ఎప్పుడొచ్చినా తాను వారిని స్వయంగా కలుస్తానన్న మాటను నిజం చేస్తూ ఉప ముఖ్యమంత్రి హోదాలో శనివారం జనసేన పార్టీ కార్యాలయానికి వినతులు తీసుకొని వచ్చిన బాధితులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలు నేరుగా విన్నారు. పరిష్కారానికి తగు హామీలను ఇచ్చారు.
శనివారం మధ్యాహ్నం అసెంబ్లీ నుంచి తిరిగి వస్తూ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వెలుపల బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్ద ఆగి అక్కడే కూర్చొని బాధితుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. వారి కష్టాలను ఓపికగా విన్నారు. సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చి పంపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఏవిధంగా వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారో ఇప్పుడు అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. వెంటనే వారి సమస్యలకు ఓ పరిష్కారం చూపే బాధ్యతను తీసుకున్నారు. బాధితులు చెప్పిన కొన్ని సమస్యలు ఇవి ….
కుమార్తె అదృశ్యమైందని ఫిర్యాదు చేసి
విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అనీ… ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు పవన్ కళ్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది. తమ కూతురు చదువుకునే విజయవాడ కమిషనరేట్ పరిధిలోనిది కావడంతో మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడంలేదని వేదన చెందారు. జాడ తెలిశాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని చూపారు. వెంటనే స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాచవరం సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. దీనిపై చర్యలకు ఆదేశించారు. బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్ కు పంపించారు.
• మాచర్ల నియోజకవర్గం రెంటచింతల ప్రాంతానికి చెందిన మత్సకారుడు జంపయ్యను ఇంటి కోసం సొంత మనవళ్లే వేధిస్తున్నారని, హింసిస్తున్నారని జంపయ్య దంపతులు పవన్ కళ్యాణ్ కి విన్నవించుకున్నారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని వాపోయారు. అక్కడున్న రెవెన్యూ, పోలీసు అధికారులతో మాట్లాడతామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.

- Advertisement -


• కర్నూలు జిల్లాకు చెందిన సువర్ణ తన కుమారుడికి బ్రెయిన్ ఆపరేషన్ కోసం ఆర్థిక సాయం అందించే ఏర్పాట్లు చేయాలని కోరారు.
• జగయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో పని చేస్తున్న పాటి నాగరాజు అనే అవుట్ సోర్సింగు ఉద్యోగి తనను రాజకీయ పరమైన కారణాలతో కక్షకట్టి ఉద్యోగం నుంచి తొలగించారని, తనను ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ కి వినతిపత్రం అందజేశారు.
• 30 మంది దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకునేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. వారందరితో ప్రత్యేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News