Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Emmiganuru politics: బీసీలు అంటూ డ్రామాలు

Emmiganuru politics: బీసీలు అంటూ డ్రామాలు

నా దగ్గర ఉన్న వారందరూ బీసీలే

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మచాని సోమప్పకు నిజమైన వారసుడు మా నాన్న బీవీ మోహన్ రెడ్డి అని మచాని సోమప్ప వారసులు అని చెప్పుకునే వారు ఇన్నాళ్లు ఇక్కడ కనపడ లేదని ఎన్నికలు ముందు వచ్చి బిసిలు అంటూ ప్రచారాలు చేస్తున్నారని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. స్థానిక మచాని సోమప్ప మెమోరియల్ హాల్ లో టిడిపి జిల్లా అధ్యక్షుడు బీటి నాయుడు సమక్షంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ స్థాయి టిడిపి కార్యకర్తల సమావేశం సూపర్ సిక్స్ పతకాలు గ్యారెంటీలపై టిడిపి పట్టణ అద్యక్షుడు సుందర్ రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బీవీ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొందరు బిసిలు అంటూ డ్రామాలు ఆడుతున్నారు. బిసిలు అందరూ నా పక్కనే అన్నారు.

- Advertisement -

మా నాన్న బీవీ మోహన్ రెడ్డి బిసి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ,అగ్రవర్ణాలు కు అండగా ఉంటూ వారి అభివృద్ధికి కృషి చేశారు. మా కుటుంబానికి బీసీలు రెండు కళ్ళు. నా ప్రక్కన ఉన్న వారందరూ బీసీలే. టికెట్ ఎవరైనా అడగవచ్చు కానీ పార్టీ కోసం పని చేసిన వారిని గుర్తించాలి. వాల్మీకి, కుర్ణీ, కురువ ఇతర వర్గాలకు వైసిపి ఏమి చేసిందని ప్రశ్నించారు. టిడిపిలో 99 శాతం బీసీలే ఉన్నారు అన్నారు.

నన్ను కొనే మొనగాడు పుట్టలేదు…..

నన్ను కొనే మొనగాడు ఇంకా పుట్టలేదని నేను డబ్బులు తీసుకుంటున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిడిపి జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఎవరికి భయపడేది లేదు. నేను పైనుండి రాలేదు. కింది స్థాయి నుండి వచ్చాను భయపెట్టాలని చూస్తే ప్రతిగటిస్తాం. బయట బూడిద కనిపిస్తుంది. లోపల నిప్పు ఉంటుంది. బుడిదే కదా అని ముట్టుకుంటే అగ్గికి అహుతి అవుతారని హెచ్చరిక చేశారు. ఎమ్మిగనూరు టిడిపి టికెట్ ఇచ్చే అధికారం నాకు ఉంటే ఇప్పుడే ఇచ్చేవాడిని. టికెట్ ను చంద్రబాబు ప్రకటిస్తారు. ఇటీవల బీవీ జయనాగేశ్వర రెడ్డి చంద్రబాబును కలిశారు. దీనిపై చంద్రబాబు నాతో మాట్లాడారు. జయనాగేశ్వర రెడ్డి ఎందుకు వచ్చావు. నీ పని నీవు చేసుకో పో అని చెప్పినట్లు తెలిపారు. అయితే కొందరు ఇక్కడ నాకే టికెట్ వస్తుంది అని సైకల్ యాత్ర, ఇంటింటి ప్రచారం, కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేసే ముందు జిల్లా రాష్ట్ర పార్టీ అనుమతి ఉండాలి. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాకు బీవీ జయనాగేశ్వర రెడ్డి కు తగాదాలు పెట్టాలని చూస్తున్నారు. మాది అన్నదమ్ముల అనుబంధం. బీవీ మోహన్ రెడ్డి నాకు రాజకీయ చేయూత ఇచ్చారు. నేను ఈ స్థాయికి ఎదగడానికి బీవీ మోహన్ రెడ్డి కారణం. బిసిలు రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తున్నాం. బుట్టా రేణుకను ఓడించడానికి నాకు అవకాశం వచ్చింది. ఆమెను ఒడిద్దాం. బీవీపై రెండో ఆలోచన పెట్టుకోవద్దు. జగన్ ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News