Monday, July 8, 2024
Homeపాలిటిక్స్Errabelli: మళ్లీ ఆశీర్వదించండి, ఎమ్మెల్యేగా 7వ సారి?

Errabelli: మళ్లీ ఆశీర్వదించండి, ఎమ్మెల్యేగా 7వ సారి?

వరసగా 8వ సారి బరిలోకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

మరోసారి ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేసేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఛాన్స్ రావటంతో.. హైదరాబాద్ లో మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు.

- Advertisement -

పార్టీ అధ్యక్షులు, సీఎం కెసిఆర్ విడుదల చేసిన BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ లో తనకు అవకాశం కల్పించిన సీఎం కెసిఆర్ కి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కి రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి, పాలకుర్తి శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. తనను మరోసారి ఆశీర్వదించండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వరసగా 8వ సారి బరిలోకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిగుతుండగా, ఓటమి ఎరుగని నేతగా ఉన్నారు. ఎమ్మెల్యేగా 7వ సారి..! కాగా, గతంలో ఒకసారి వరంగల్ ఎంపీగా మంత్రి గెలిచారు. ఇంకోసారి సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బరిలోకి దిగుతున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశా…! రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపా…!! ఇంకో అవకాశం ఇస్తే, మీ సేవకుడి లా పని చేస్తా… ప్రజల రుణం తీర్చుకుంటా అన్నారు. పాలకుర్తి ప్రజలు మంచివారిని, తమకు మంచి చేసే వారిని ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుని గుండెల్లో నిలుపుకుంటారని అన్నారు. తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించిన సీఎం కెసిఆర్ కి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి కృతజ్ఞతలు…! ధన్యవాదాలు!! తెలిపారు. ఇదిలా ఉండగా పాలకుర్తి నియోజకవర్గంలో సంబురాలు అంబరాన్ని అంటాయి. హైదరాబాద్ లో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు పలువురు మంత్రి ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్:
పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశాను, ప్రతి గ్రామానికి రోడ్లు, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, వివిధ గ్రామాలకు లింకు రోడ్లు వేయించి, బురుగు నీటి కాలువలు వేసి, కడిగిన ముత్యంలా చేశా.. పాలకుర్తి, బమ్మెర, వల్మిడి సాహిత్య, చరిత్ర ప్రాశస్త్యం అందరికీ తెలిసేలా టూరిజం కారిడార్ ను అభివృద్ది చేశాను. చరిత్ర కలిగిన దేవాలయాలకు పునర్ వైభవం తీసుకొచ్చాను. తొర్రూరు పురపాలక పట్టణాన్ని సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ ల ఆశీస్సులతో అభివృద్ది చేశాను. మరోసారి అవకాశం ఇస్తే మీ సేవకుడి లా పని చేస్తా… మీ రుణం తీర్చుకుంటానంటూ ఎర్రబెల్లి చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News