మోడీ ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దిశానిర్దేశం చేశఆరు. మోడీ ప్రభుత్వం అటు దేశ ప్రజలతో పాటు, తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయాలను వివరించాంటూ ఎర్రబెల్లి ఉద్బోదించారు. పార్టీకి కార్యకర్తలే దేవుళ్ళని వారిని కాపాడుకోవలసిన బాధ్యత మనదే నని వారిని కాపాడుకోవాలి అన్నారు. ఆత్మీయ సమ్మేళనాల్లో సీఎం కెసిఆర్ సందేశం ప్రతి కార్యకర్తకు చేరాలి అన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనాలు, వాటి ఏర్పాట్లపై ఉమ్మడి వరంగల్ జిల్లా కు సంబందించిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, హన్మకొండ, వరంగల్ జిల్లాల పార్టీ ఇంఛార్జి, ఎమ్మెల్సీ ఎం.ఎస్ ప్రభాకర్ రావు, జిల్లా ముఖ్య నేతలతో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, GWMC మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎమ్మెల్యేలు రాజయ్య, ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, వొడితెల సతీష్ కుమార్, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు వాసుదేవ రెడ్డి,నాగుర్ల వెంకటేశ్వర్లు, మార్నేని రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.