రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు అని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి అన్నారు. స్థానిక నివాసంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. 9 ఏళ్లు ఏకాలం సిఎంగా పనిచేసిన చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి, కమీషన్ తీసుకొని వెళ్ళాడు. జలయజ్ఞం కింద లక్ష కోట్లు ఏర్పాటు చేసి 70 శాతం ప్రాజెక్టుల పనులు పూర్తి చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుంది. పులికనుమ ప్రాజెక్టును సాధించిన ఘనత మాకే దక్కింది. వచ్చే ఎన్నికల్లో టిడిపి ఓటమి ఖాయమని గ్రహించిన చంద్రబాబు పథకం ప్రకారం పుంగనూరులో అల్లర్లకు ప్రేరేపించారు. దీనిని వైసిపి పైకి నెట్టాలని కుట్రలు చేస్తున్నాడు. వెన్నుపోటు , మోసపూరిత రాజకీయాలకు అలవాటు పడిన చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మడం లేదని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ సమావేశంలో వైసిపి నాయకులు బీఅర్ బసిరెడ్డి, భీమ్ రెడ్డి,బుట్టా రంగయ్య, డాక్టర్ రఘు,నజీర్ అహ్మద్,రియాజ్, విరుపాక్షి రెడ్డి, పాల్గొన్నారు.
Errakota: ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత బాబుకు లేదు
పుంగనూరులో ఉద్దేశ పూర్వకంగనే టిడిపి దాడులు