Friday, November 22, 2024
Homeపాలిటిక్స్G-20: రాహుల్ జోడో యాత్ర Vs మోడీ విశ్వ జోడో యాత్ర

G-20: రాహుల్ జోడో యాత్ర Vs మోడీ విశ్వ జోడో యాత్ర

భారత్ జోడో యాత్ర అంటూ తన పొలిటికల్ ఇమేజ్ ను ఓవైపు రాహుల్ గాంధీ బ్రహ్మాండంగా పెంచుకుంటున్నారు. రాహుల్ యాత్రకు, కాంగ్రెస్ జోరుకు గట్టి పోటీ ఇచ్చేలా బీజేపీ కూడా సిద్ధమైంది. జీ-20 సమావేశాలతో విశ్వ జోడో యాత్రతో మోడీ దూసుకువచ్చేలా కమలనాథులు పెద్ద స్కెచ్ వేశారు. కర్నాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేందుకు, రాహుల్ కు పొలిటికల్ మైలేజ్ కు చెక్ పెట్టేలా 2023 కమలం డైరీ రెడీగా ఉండటం హైలైట్.

- Advertisement -

వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరుగనుండటంతో ఈ ఇయర్ పొలిటికల్ హీట్ బ్రహ్మాండంగా ఉండనుంది. హ్యాట్రిక్ కొట్టాలని మోడీ-షా ఉవ్విళ్లూరుతుండగా గత వైభవం కోసం గాంధీ కుటుంబం పోరాడుతోంది. ఇక ఈ మేరకు బీజేపీ అప్పుడే ప్రచారాన్ని పరిగెత్తిస్తోంది. 72 ఏళ్ల మోడీ ..ఇప్పటి వరకు గుజరాత్ కు, ఆతరువాత దేశానికి సేవ చేశారని ఇక ఇప్పుడు యావత్ విశ్వానికి సేవ చేస్తారని కేంద్ర క్యాబినెట్ మంత్రి అప్పుడే బాకా ఊదేస్తున్నారు.

విశ్వగురు, గ్లోబల్ లీడర్స్, వల్డ్ ఎకానమీస్ అంటూ పదేపదే వల్లె వేస్తున్న బీజేపీ ఇప్పుడు జీ-20 వేదికగా మరింత పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కు దిగుతోంది. మొత్తానికి మోడీ కెరీర్ లో 2023 మోస్ట్ బిజియెస్ట్ ఇయర్ గా నిలిచిపోవటం ఖాయంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News