ప్రపంచంలో అతి పెద్ద రివర్ క్రూజ్ అన్నారు బానే ఉంది..కానీ ఆ భారీ నౌకలో బార్ ఉందికదా దాని సంగతేంటి అంటారు అఖిలేష్. పవిత్ర గంగానదిపై ఈ బార్ ఏంది..గంగానదిపై తాగుడును ప్రోత్సహిస్తూ బార్ ను అనుమతించి ఈ సర్కారు చేస్తున్నదేందంటూ ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భగ్గుమన్నారు.
- Advertisement -
పాతవాటిని పునఃప్రారంభించటం భారతీయ జనతా పార్టీకి అలవాటేనన్న అఖిలేష్.. ప్రధాని మోడీ ప్రారంభించిన ఎంవీ గంగా రివర్ క్రూజ్ కూడా 17 ఏళ్లుగా సేవలందిస్తున్న క్రూజేనని, ఇందులో ఇప్పుడు తాజాగా బార్ ను అందుబాటులోకి తెచ్చి ఆల్కహాల్ ను కూడా సర్వ్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ వివాదాలపై బీజేపీ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.