Tuesday, September 17, 2024
Homeపాలిటిక్స్Gangula: చంద్రబాబు మాటల మాంత్రికుడు

Gangula: చంద్రబాబు మాటల మాంత్రికుడు

సీఎంగా చంద్రబాబు సాధించిన అభివృద్ధి ఏమిటి?

రాష్ట్ర ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉండి రాష్ట్రానికి ఏం చేశారని గొప్పలు చెప్పుకుంటున్నారంటూ కేవలం మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నారని ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. గడచిన 14 సంవత్సరాలలో గుర్తుకురాని ప్రాజెక్టులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చాయో తమకు అర్థం కావడం లేదని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన ఒట్టు బూటకమని అన్నారు. ఆయన రాక వల్ల పుంగనూరులో జరిగిన సంఘటనలు గత రెండు రోజులు నుంచి చూస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఏరోజైనా ఆయన ప్రాజెక్టులను గురించి పట్టించుకున్నారా అని గంగుల ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో ఏ రోజైనా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారని ప్రశ్నించారు. అధికార దాహంతో చంద్రబాబు ఏదో ఒకరకంగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజా స్పందన చూసి ఓర్వలేక ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే గంగుల విరుచుకుపడ్డారు. చంద్రబాబు తన స్థాయిని దిగజారితే ఆయన పెద్దరికానికి కూడా ఎవరు విలువ ఇవ్వరని ఎమ్మెల్యే గంగుల బ్రిజెంద్రా రెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి చేసే అవకాశం ఉండి చేయలేకపోయారని. ముఖ్యమంత్రి మాట ఇచ్చిన ప్రకారం మూడు కోట్లు డి పి ఆర్ ఓ నోటు తెచ్చుకొని సచివాలయానికి 20 లక్షలు అలాగే ఆళ్లగడ్డ కు సంబంధించి సచివాలయానికి 50 లక్షలు ఇచ్చారని మంత్రిగా ఉండి తెలుగు గంగా కాలువలు గురించి ఏనాడైనా పట్టించుకున్నారా గతంలో మీరు చేసిన భాగవతాలన్నీ చెప్పాలంటే చారడంతో ఉన్నాయని రైతుల్లో నోట్లో మన్ను కొట్టి మహారాష్ట్ర నుండి మినుములు తెచ్చి అడ్డంగా దోచుకున్నారు లేదా ఇలాంటి చెప్పుకుంటూ పోతే కోపంలో ఉన్నాయని ప్రజాక్షేత్రంలో మాట్లాడదాం రండి అని ఆయన సవాలు విసిరారు. టిడిపి ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు ఈ సమావేశంలో కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి, గోపవరం నరసింహారెడ్డి, న్యాయవాది అశ్వర్థ రెడ్డి,డాబా మనోహర్ రెడ్డి, రామకృష్ణ, మర్రిపల్లి తులసి రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News