రాష్ట్రంలో త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులను గెలిపించాలని ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. చాగలమర్రిలోని సెంటాన్స్ పాఠశాల సమీపంలోని అష్రఫ్ నగర్ లో వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు చికెన్ సెంటర్ యజమాని మాలి భాష కొత్తగా నిర్మించుకున్న గృహాన్ని ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే గంగుల నాని ఇక్కడికి చేరుకోగానే వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నవరత్నాల ద్వారా మహిళలకు రైతులకు పేద ప్రజలకు, అన్ని వర్గాల వారికి ముఖ్యమంత్రి జగనన్న లబ్ధి చేకూర్చారన్నారు . పార్టీలకతీతంగా తమ ప్రభుత్వంలో మేలు జరిగిందని ఆయన తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్నారని ఆయన కొనియాడారు. ముఖ్యంగా మహిళల ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్ , వైఎస్సార్సీపీ పార్టీ మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, మండలాధ్యక్షులు వీరభద్రుడు, గజ్జల రాఘవేంద్రారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు ముల్లా రఫీ, మండల కో ఆప్షన్ సభ్యుడు జిగ్గి గారి ఇబ్రహీం , ఎంపిటిసి ఫయాజ్, మార్కెట్ యాడ్ డైరెక్టర్ ముల్లా జాబిర్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు, గణేష్ రెడ్డి, తెలుగు గంగ ఏఈ షేక్ సలీం , వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు వెంకటరమణ, డాబా మనోహర్ రెడ్డి , ముల్లా ఖాదర్బాషా, ఒలిసా గారి షరీఫ్ , ముల్లా బ్రాందీన్, పెయింటర్ షరీఫ్ , షేక్ షబ్బీర్ , అబ్దుల్లా, సున్నా, ముల్లా రఫీ, లడ్డు భాయ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు .