నాడు కిరణ్ కుమార్ రెడ్డి రూపాయి ఇవ్వం, ఏం చేసుకుంటారో చేస్కోండి అన్నడు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు మెదపలేదు, కానీ, ప్రజలు గుణపాఠం చెప్పారు, కాంగ్రెస్ గల్లంతు చేశారంటూ హరీష్ రావు గుర్తుచేశారు. బిజెపి ఏది అడిగినా ఇవ్వడం లేదని, కాంగ్రెస్ పార్టీకీ పట్టిన గతే కాంగ్రెస్ కి పడుతుందని హరీష్ హెచ్చరించారు. బిజెపి తెలంగాణకు అన్యాయం చేస్తోందంటూ భగ్గుమన్నారు. మెదక్ జిల్లా శివ్వంపేట ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.
- Advertisement -
నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో చెప్పారు ఏమి చేయలేదు, బిజెపి వాళ్ళు పెద్ద నోట్ల రద్దు, జనధన ఖాతా అన్నారు రూపాయి వేయలేదంటూ హరీష్ మండిపడ్డారు.