ఆర్టీసీని ప్రభుత్వంలో విలినాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమని మంత్రి హరీష్ రావ్ పేర్కొన్నారు.. ఇది కేసీఆర్ ఇచ్చిన బహుమతి, మీ చిరకాల వాంఛ నెరవేర్చిందంటూ మంత్రి అన్నారు. ఇక నుండి ఆర్టీసీ కార్మికులు కాదు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులన్నారు మంత్రి హరీష్ రావు. ఇన్ని రోజులు ఈ ఫైల్ పెండింగ్ లో పెట్టినప్పటికీ ఇవాళ గవర్నర్ ఆమోదం తెలిపటంతో ఈ ప్రక్రియ పూర్తయిందని మంత్రి ఖమ్మంలో చెప్పుకొచ్చారు. ధర్మం గెలుస్తుంది అనడానికి ఇదే నిదర్శనం నాటి పాలకులు ఆర్టీసి అడ్రస్ లేకుండా చేయాలని కుట్రలు పన్నారని, మా ప్రభుత్వం ఆర్టీసీకి కార్మికులకు పట్టం కట్టిందన్నారు.
కాంగ్రెస్ కొట్లదితున్నది. మత కలహాలు సృష్టించి ఎంతకైనా దిగజార్చే పరిస్థితి కాంగ్రెస్ కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీ ఉండే, ఇప్పుడు బెంగళూరు అయ్యింది. మా కు హైకమాండ్ ప్రజలే. ఖమ్మం కరుణ కేసీఆర్, బి ఆర్ ఎస్ పై ఉండాలి. సీతారామ పథకం పనులు చివరి దశలో ఉంది. ఇక్కడి ప్రాంతం సస్య శమలం కావాలంటే కేసీఆర్ దీవించండి. సీతారామ పూర్తి అయితే కరువు అనే పదం డిక్షనరీలో ఉండదు. వచ్చే వానాకాలం నాటికి కృష్ణా లో నీళ్ళు ఉన్న లేకున్నా గోదావరి జలాలు వస్తాయి. కృష్ణా నది పరివాహక ప్రాంతం ఏపీలో క్రాప్ హాలిడే ప్రకటించారు. సీఎం గారికి ఖమ్మం పై ప్రత్యేక ప్రేమ. నాడు ఉద్యమ సమయంలో ప్రజలు గుండెకు హత్తుకున్నారు. అందుకే ఖమ్మం కరువు తొలగించాలని సీఎం కోరిక అంటూ హరీష్ ప్రసంగించారు.