Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Harish Rao Tandur sabha: ఇరుగు పొరుగు రాష్ట్రాలతో మన ప్రాంతాలను పోల్చి చూడమని హరీష్...

Harish Rao Tandur sabha: ఇరుగు పొరుగు రాష్ట్రాలతో మన ప్రాంతాలను పోల్చి చూడమని హరీష్ సవాలు

తాండూర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో కలసి 50 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..రెండోసారి పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే కాబోతున్నారని, రోహిత్ రెడ్డి సూచన మేరకు 25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే నర్సింగ్ కాలేజీకి శంఖుస్థాపన చేసుకున్నామన్నారు.

- Advertisement -

మరో పది కోట్ల రూపాయలతో సబ్ స్టేషన్ ల శంఖుస్తాపన చేసుకున్నామని, ఇటు పక్క చించోలి అటు పక్క సేడం ఉన్నాయి వేరే రాష్ట్రాల్లో ఉన్న ఆ రెండు పట్టణాలలో అభివృద్ధి చూడండి.. ఇక్కడ అభివృద్ధి చూడండి.. ఇక్కడ పెన్షన్ చూడండి.. అక్కడ పెన్షన్ చూడండి. అంగన్ వాడి, ఆశా వర్కర్ల జీతాలు కర్ణాటకలో కన్నా మన దగ్గర ఎక్కువన్నారు హరీష్. పీఎం సొంత రాష్ట్రం గుజరాత్ లో అంగన్ వాడీల జీతం 6 వేలు.. మన దగ్గర రెండు రెట్లు ఎక్కువ.

అంగన్ వాడీ ఆశా వర్కర్లను సిపిఐ నాయకులు రెచ్చ గొడుతున్నారన్నారు మంత్రి. వాళ్ళ కోసం మోసపోవద్దు త్వరలో prc నోటిఫికేషన్ వస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. మళ్ళీ అందరి జీతాలు పెరుగుతాయన్నారు. కేసీఆర్ మనసును ప్రేమతో గెలవాలి పోరాటంతో కాదన్నారు హరీష్. మోడీ త్వరలో తెలంగాణ వస్తున్నారని.. అంగన్ వాడి, ఆశా వర్కర్లు కలిసి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జీతాలు ఎందుకు పెంచడం లేదని నిలదీయాలని పిలుపునిచ్చారు హరీష్.

తెలంగాణపై వివక్షలో A1 కాంగ్రెస్ అయితే A2 బీజేపీ అని నిప్పులు చెరిగారు హరీష్. ఆ రెండు పార్టీలు ఏం చేసినా మళ్ళీ గెలిచేది, హ్యాట్రిక్ కొట్టేది బీ ఆర్ ఎస్, కేసీఆర్ యేనన్నారు. అప్పటి తాండూర్ ఎలా ఉంది ఇప్పటి తాండూర్ ఎలా ఉంది. మంత్రి మహేందర్ రెడ్డి అండతో రోహిత్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు హరీష్.

మొన్న కేంద్రీయ విద్యాలయాలు ప్రకటిస్తే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదన్న హరీష్.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రీయ విద్యాలయం కూడా ఇవ్వని మోడీ ఏం చెప్పేందుకు తెలంగాణ వస్తున్నారన్నారు. కోటిపల్లి రిజర్వాయర్ సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హరీష్ ఈ సభలో స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News