Monday, November 25, 2024
Homeపాలిటిక్స్Huzurabad: ఆకట్టుకుంటున్న సీఎం రేవంత్ గాడిద గుడ్డు ప్రచారం

Huzurabad: ఆకట్టుకుంటున్న సీఎం రేవంత్ గాడిద గుడ్డు ప్రచారం

లక్ష ఓట్లతో గెలిపించాలి

హుజూరాబాద్ జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు ప్రచారం హైలైట్ గా సాగింది. అందరినీ ఆకట్టుకునేలా ఈ గాడిద గుడ్డు కాన్సెప్ట్ సక్సెస్ కావటం విశేషం. చింతమడక నుంచి వచ్చిన కేసీఆర్ కు కరీంనగర్ ప్రజలు అండగా నిలబడ్డారని, కరీంనగర్ ను వదిలి కేసీఆర్ మహబూబ్ నగర్ వస్తే మేం ఆలోచించకుండా గెలిపించామని..సెమీఫైనల్ లో కేసీఆర్ ను చిత్తు చిత్తు చేశామంటూ రేవంత్ ప్రసంగం సాగింది.

- Advertisement -

ఫైనల్స్ లో తెలంగాణ పౌరుషం గుజరాత్ కు తెలిసే విధంగా మోడీని ఓడించాలని, పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదని, బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు తెచ్చింది ఏమీ లేదన్నారు రేవంత్. పునర్విభజన చట్టంలోని ఏ అంశాలను కూడా అమలు చేయలేదని, తల్లిని చంపి బిడ్డను బతికించారంటు పార్లమెంటులో తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలను అవమానించేలా మోదీ మాట్లాడారన్నారు.

తెలంగాణను అవమానించిన బీజేపీకి, బండి సంజయ్ కు ఓటు వేయాలా? కరీంనగర్ లో అరగుండు, నిజమామాబాద్ లో గుండు రాష్ట్రానికి తెచ్చిందేం లేదని రేవంత్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు పదేళ్లు మోదీ ఇచ్చింది గాడిద గుడ్డన్న ఆయన, కర్ణాటకకు చెంబు, ఎపీకి మట్టి, తెలంగాణ కు గాడిద గుడ్డు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వమన్నారు. అయోధ్యలో రాముడి కళ్యాణానికి 15 రోజుల ముందే అక్షింతలు పంచారని, ఇది శ్రీరాముడిని అవమానించడమేనన్నారు.

హిందువులందరూ ఆలోచించాలి.. రాజకీయాల కోసం రాముడిని వాడుకుంటున్నారన్నారు. నేను హిందువును..కాని ఓట్ల కోసం హిందుత్వాన్ని వాడుకోమన్న ఆయన దేవుడు గుడిలో ఉండాలి..భక్తి గుండెల్లో ఉండాలన్నారు. రాముడి పేరు చెప్పుకొని ఓట్లు అడుకునే దిక్కుమాలిన పరిస్థితి కరీంనగర్, నిజామాబాద్ లో ఉందని విమర్శించారు. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర చేస్తోంది.. నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరించాలన్నదే బీజేపీ కుట్ర అంటూ సీఎం ప్రచారం సాగింది.

నేను రిజర్వేషన్లపైన మాట్లాడితే ఢిల్లీ నుంచి వెంటనే పోలీసులు వచ్చారన్న ఆయన పదేళ్లు కేసీఆర్ నన్ను వేధించి కేసులు పెట్టి జైలుకు పంపాడు..చివరకు ఏమైంది నడుం ఇరిగి మూలకు పడ్డాడన్నారు. కారు కరాబు అయి కార్ఖానాకు పోయింది.. మూలకుపడింది, కారు మూలకు పడింది కాబట్టే కేసీఆర్ బస్సు ఎక్కాడన్నారు. తిక్కలోడు తిరనాళ్లకు పోయినట్లు కేసీఆర్ బస్సు యాత్ర ఉందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, మహబూబ్ నగర్, చేవేళ్ల, భువనగిరి, కరీంనగర్, మల్కాజ్ గిరి లాంటి సీట్లలో బీజేపీని గెలిపించాలని కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారన్నారు.

నల్గొండ, మెదక్ లాంటి సీట్లలో బీఆర్ఎస్ ను గెలిపించాలన్నది బీజేపీ ప్రయత్నమని, కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానివ్వమన్నారు. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ గోడ మీద వాలినా కాల్చి అవతలపారేస్తమని హెచ్చరించారు. 12 సీట్లతో బీఆర్ఎస్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? బీజేపీ,బీఆర్ఎస్ కుట్రలు చూసే కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ కు మద్దతునిచ్చాయన్నారు.

వెలిచాల రాజేందర్ రావును కరీంనగర్ ఎంపీగా లక్ష మెజార్టీతో గెలిపించాలని రేవంత్ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News