తెలంగాణ కవి, గాయకుడైన దేశపతి శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మునిగడప గ్రామంలో స్వర్గీయ శ్రీ దేశపతి గోపాలకృష్ణ శర్మ, శ్రీమతి బాలసరస్వతి దంపతులకు 1970లో జన్మించారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమ నాయకుడు, నేటి రాష్ట్ర సారథి సీఎం కేసీఆర్ గారు నిర్వహించిన వేలాది సభలు, సమావేశాలు, ర్యాలీలలో దేశపతి పాల్గొన్నారు. తెలంగాణా మలిదశ ఉద్యమంలో తన ఆటా పాటలు ప్రసంగాలతో భావజాల వ్యాప్తికి కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం తన ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రస్తుతం సీఎం ఓ.ఎస్.డి.గా పని చేస్తున్నారు. దేశపతి కృషిని గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయనకు శాసనమండలి అభ్యర్థిగా అవకాశమిచ్చారు.
ఈ నెల తొమ్మిదిన ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీ ఆవరణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ నామినేషన్ పత్రాలు దేశపతి సమర్పించనున్నారు.