కేసీఆర్ బీసీల పక్షపాతి అన్న మంత్రి గంగుల కమలాకర్..ఇందుకు నిదర్శనంగా అత్యున్నతమైన శాసన సభ తొలి స్పీకర్గా మధుసుధనాచారికి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్గా బండా ప్రకాష్ అవకాశం ఇవ్వడమేనన్నారు. వెనుకబడ్డ బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ వారి ఆకలిని తీర్చి వారి ఆత్మగౌరవానికి బాసటగా నిలుస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బీసీలకు సగర్వమైన వాటాను అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణలో కేసీఆర్ దే అన్నారు, రైతుబంధు సహా అనేక పథకాల్లో బీసీలదే మెజార్టీ వాటా అన్న గంగుల నేరుగా బలహీన వర్గాల కోసం వేయికిపైగా గురుకులాలు, వేల కోట్ల విలువైన స్థలాల్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారన్నారు. రాజకీయంగానూ ముదిరాజ్, రజక, నేత, యాదవ, కాపు, గౌడ ఇలా బీసీల్లోని సామాజిక వర్గాలకు అవకాశం ఇస్తున్నారన్నారు, ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు మంత్రి గంగుల కమలాకర్.