మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఆయన చాలాకాలం తరువాత సొంత గూటికి వచ్చినట్టైంది. గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్శి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇంద్రకరణ్ రెడ్డి, ఐకే రెడ్డితోపాటు డాక్టర్ వెన్నెల అశోక్, సంచార జాతుల కులాలకు చెందిన ముఖ్య నాయకులు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, నాయకులు సంగిశెట్టి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

