Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Huzurabad: ఆకట్టుకుంటున్న చిన్నారి పాడి శ్రీనిక రెడ్డి ప్రసంగం

Huzurabad: ఆకట్టుకుంటున్న చిన్నారి పాడి శ్రీనిక రెడ్డి ప్రసంగం

ఒక్కసారి మా డాడీకి ఓటు వేయరా ప్లీజ్

నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా డాడీ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలే తన కుటుంబంగా భావిస్తుండేవాడు. నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే వాడు. మా ఇంట్లో కంటే ప్రజల మధ్య ఉంటూ ప్రజాసేవ చేయడం అంటేనే మా డాడీకి ఎక్కువగా ఇష్టం. అందుకోసం తనకిష్టమైన క్రికెట్ క్రీడను సైతం వదులుకొని నియోజకవర్గ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటున్నాడు అంటూ బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తనయ పాడి శ్రీనిక రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతుండడం పలువురుని ఆకట్టుకుంటోంది.

- Advertisement -

మా డాడీని చిన్నప్పుడు అడిగేదాన్ని డాడీ ప్రపంచంలో ఎన్నో ఉద్యోగాలు ఉండగా మీరు ప్రజాసేవ అనే ఈ ఉద్యోగమే ఎందుకు ఎంచుకున్నారని డాడీ చెపుతుంటే నాకు అప్పుడు అర్థం కాలేదు. డాడీ అప్పుడు అలా ఎందుకు చెప్పాడో ఇప్పుడు డాడీని చూస్తే అర్థమయింది. ఎప్పటికైనా హుజురాబాద్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ ల చేయాలని అప్పుడు అన్నమాట ఇప్పుడు గుర్తొస్తున్నాయి. మా డాడీకి ఓటు వేసి గెలిపిస్తే హుజురాబాద్ ని హైదరాబాద్ గా తీర్చిదిద్దుతాడని నాకు నమ్మకం ఉందని, ఒక్కసారి మా డాడీకి ఓటు వేయరా ప్లీజ్ అని ఓటర్లను కోరుతుండడంతో ఆ చిన్నారి మాటలకు ఓటర్లు ఒక్కసారిగా కేరింతలు చేస్తూ చప్పట్లు కొడుతూ జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తుండటం ఆసక్తికరంగా మారుతోంది.

ఆ చిన్నారి మాటలకు నియోజకవర్గ ప్రజలు సైతం ఈసారి ఓటు మీ డాడీకే వేస్తామని మా సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉంటుందని చెప్తుండడం విశేషం. హుజురాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని పాడి కౌశిక్ రెడ్డి విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో పాడి కౌశిక్ రెడ్డి కూతురు పాడి శ్రీనిక రెడ్డి తన తండ్రి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటూ ఆమె మాట్లాడుతున్న తీరు సమావేశాలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కాబోయేది కెసిఆరేనని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని ఆమె మాటల్లో వివరిస్తూ ఉండడంతో సమావేశాలకు హాజరవుతున్న ఓటర్లు ఆసక్తిగా వింటున్నారు.

తాను వేసవి సెలవులలో ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఎంతో అభివృద్ధి చెందిన దేశాలలోని ప్రధాన పట్టణాలలో ఉన్న వసతులు మన రాష్ట్రంలో కనిపిస్తున్నాయని చెప్తుండడంతో సభా ప్రాంగణం అంతా చప్పట్లతో దద్దరిల్లుతోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ముందు ఏర్పాటు తర్వాత సాధించిన ప్రగతిని ఆ చిన్నారి మాటల్లో వివరిస్తుండడం పలువురిని ఆకట్టుకుంటోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత పాలన సౌలభ్యం కోసం పది జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసి ప్రజలందరికీ మెరుగైన ప్రభుత్వ సేవలు అందిస్తుండడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ మేరకు లబ్ధిదారుల కుటుంబాలకు లబ్ధి చేకూర్తున్నాయని వివరిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. భావితరాల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయంటూ తన డాడీ పాడి కౌశిక్ రెడ్డి కి ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ రాజకీయాలపై ఉన్న ఆసక్తితో పాటు నియోజకవర్గ ప్రజలకు తన వంతు సేవ చేయాలనే సంకల్పంతోనే ఉన్నాడని తన డాడీకి రాజకీయాలపై ఉన్న ఆసక్తిని గమనించి తాను సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నానని ఓటర్లను ఉద్దేశించి ఆ చిన్నారి మాట్లాడుతున్న తీరు అబ్బుర పరుస్తోంది.

మా డాడీకి ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇవ్వండి. ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఒప్పించి నియోజకవర్గాన్ని రూ,1000 కోట్లతో కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తాడంటూ చిన్నారి మాట్లాడుతున్న మాట తీరుకు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే తండ్రికి తగ్గ తనయ అని అనిపించుకుంటుందని ఆ చిన్నారిని సమావేశాలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. తన డాడీ విజయం సాధించడంలో చిన్నారి శ్రీనిక రెడ్డి పోషిస్తున్న పాత్ర పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News