Thursday, July 4, 2024
Homeపాలిటిక్స్Mallapur: లోకల్ నినాదం సంజయ్ కు కలిసివస్తుందా?

Mallapur: లోకల్ నినాదం సంజయ్ కు కలిసివస్తుందా?

సంజయ్ పుట్టి పెరిగింది ఇక్కడే అంటూ ప్రచారం

ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రత్యర్థి నాయకులపై మాటల తూటాలతో నేతలు పేలుతున్నాయి. మాటల మంత్రాలను ప్రయోగించి రాజకీయాలను ఆసక్తిగా మలుచుకుంటూ ప్రజలను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో చాలా చోట్ల నాన్ లోకల్-లోకల్ అనే అంశం చాలా పెద్ద ఇష్యూగా మారింది. కోరుట్ల లోనూ స్థానికులు వర్సెస్ స్థానికేతరులు అనే మంట రగిలింది.

- Advertisement -

కోరుట్ల నియోజకవర్గంలో లోకల్ నాన్లోకల్ అనే అంశం తెరపైకి వచ్చింది. అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు ముమ్ముడ ప్రచారం చేస్తున్నారు. అందులో లోకల్ నాన్ లోకల్ అంశాన్ని ప్రజల వద్దకు చేరవేస్తున్నారు. బిజెపి కాంగ్రెస్ అభ్యర్థులు నాన్ లోకల్ నాయకులు మనకు వద్దు లోకల్ నాయకులే ముద్దు అనే నినాదంతో ముమ్ముర ప్రచారం చేస్తున్నారు. కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామానికి చెందిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పుట్టింది పెరిగింది కోరుట్ల నియోజకవర్గంలోనే అని, ప్రత్యర్థి పార్టీల నాయకులు ఒకరు నిజాంబాద్ నుంచి ఇంకొకరు ధర్మపురి నుండి వచ్చిన వారిని నాన్ లోకల్ నాయకులను నమ్మద్దని ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నారు. బిజెపి అభ్యర్థి అరవిందుని కలవాలంటే నిజామాబాదు పోవాలని, కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నరసింగారావుని కలవాలంటే ధర్మపురి పోవాలని, ఒకవేళ బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గ ప్రజల పరిస్థితి ఏంటని, లోకల్ నాయకుడైన, కల్వకుంట్ల సంజయ్ ని గెలిపించాలని బిఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News