Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Janagama: నాది ఆంధ్ర కాదు నేను పుట్టి, పెరిగింది ఇక్కడే

Janagama: నాది ఆంధ్ర కాదు నేను పుట్టి, పెరిగింది ఇక్కడే

గెలిపించే బాధ్యత మనదే: యశస్విని

జనగామ జిల్ పాలకుర్తి మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో పాలకుర్తి నియోజక వర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సి రెడ్డి ఆద్వర్యంలో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల విస్తృత సమావేశాన్ని నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య ముఖ్య అతిథిగా పాల్గొని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ఎంఎల్ఏలు ముఖ్య ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు పాలకుర్తి నుండి భారీ మెజార్టీ అందించాలి. కెసిఆర్ ప్రభుత్వం రూ 7 లక్షల కోట్ల అప్పులు చేసిన ఎన్నికల ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గ్యారెంటీ పథకాలను అమలు చేస్తున్నాడు. ఎన్నికల కోడ్ తర్వాత మరిన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతాయి. బిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏండ్లలో రాష్ట్రానికి ఒరగపెట్టింది ఏం లేదు. తప్పులు వాళ్ళు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దుతున్నారు. దేశం కోసం ఇందిరా, రాజీవ్ గాంధీలను కోల్పోయిన కుటుంబం రాహుల్ కుటుంబం. భారీ మెజారిటీతో కడియం కావ్యను గెలిపించాలని కోరుతున్నాను అన్నారు.

కడియం శ్రీహరి మాట్లాడుతూ..”పాలకుర్తి ప్రజల దెబ్బకు దయాకర్ మైండ్ బ్లాక్ అయ్యింది. యశస్విని రెడ్డి దెబ్బకు చిన్న మెదడు చితికిపోయింది. దయాకర్ రావు బిత్తిరి బిత్తిరిగా మాట్లాడుతున్నాడు. ఓటమితో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకు వచ్చింది. భారత జనతా పార్టీ తెలంగాణకు చేసింది ఏం లేదు. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చని దద్దమ్మ ప్రభుత్వం బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం. మణిపూర్ లో దళితులు, ముస్లింలు, క్రైస్తవులపై దాడులు చేసిన పట్టించుకోలేదు… మణిపూర్ భారతదేశంలో భాగం కాదా మోడీ గారు. ఉత్తరప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ పేరిట బుల్డోజర్ సర్కార్ నడిపిస్తున్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తామని అంటున్నారు, రిజర్వేషన్లు ఎత్తివేస్తారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అవసరమా. సీఎం రేవంత్ రెడ్డి తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అన్ని హామీలు నెరవేరుస్తారు అందుకే కాంగ్రెస్ పార్టీ లో చేరాం. మీరందరూ కావ్యను ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను” అన్నారు.

కడియం కావ్య మాట్లాడుతూ
“పేదవారికి సేవ చేయడం మా నాన్న కడియం శ్రీహరి వద్ద నేర్చుకున్నా. ఉమ్మడి వరంగల్ లో కడియం ఫౌండేషన్ ద్వారా నిరుపేద కుటుంబాలకు ఎన్నో సేవలు అందించా. బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్ రైతుల పొలాలు లాక్కోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, దందాలు చేయడమే ఆయన పని. కడియం కావ్య అనే నేను లోకల్, కండ్లు మూసుకొని మాట్లాడుతున్నారు, చచ్చేవరకు వరంగల్ లోనే ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తా. నిందలు వేయడం తప్ప వారు చేసింది ఏం లేదు. మోడీ ప్రభుత్వం కాజీపేట డివిజన్, కోచ్ ఫ్యాక్టరీ, లెదర్ పార్క్, మెడికల్, జాతీయ స్థాయి కళాశాలలో మంజూరు చేయలేదు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం వల్లనే మా నాన్న కడియం, నాకు పదవులు దక్కుతున్నాయని, బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని రద్దుచేసి రిజర్వేషన్ లేకుండా చేస్తాం అంటున్నారు. మోడీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదు..బిఆర్ఎస్, బిజెపి పార్టీలు లోపాయకారి ఒప్పందం వల్లే వరంగల్ పార్లమెంటు నుండి బిఆర్ఎస్ పార్టీ బలహీనమైన అభ్యర్థిని ప్రకటించారు. కడియం బిడ్డగా నీతి, నిజాయితీగా ప్రజలకు సేవలు అందిస్తా… అలా చేయనినాడు రాజకీయాల నుండి తప్పుకుంటా.. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే తెలంగాణలో 15 ఎంపీ సీట్లు గెలవాలి” అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News