Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Janagama Demands: స్థానిక బిసికే ఎమ్మెల్యే టికెటివ్వాలి

Janagama Demands: స్థానిక బిసికే ఎమ్మెల్యే టికెటివ్వాలి

నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ డిమాండ్

జనగామ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని స్థానిక బిసి బడుగు బలహీన వర్గానికె టికెట్ కేటాయించాలని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ అన్నారు. చేర్యాలలో సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ వో సి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ
సీఎం కేసీఆర్ జనగామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెండింగ్లో ఉంచినందున మా అభ్యర్థిత్వాన్ని పరిశీలించి మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రి హరీష్ రావులను పత్రికా ముఖంగా విన్నవించుకుంటున్నారు. స్థానికంగా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్న మా నాన్నగారు నాగపురి రాజలింగం గత 50 సంవత్సరాలుగా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎనలేని సేవ చేశారని చేర్యాల సమితి ప్రెసిడెంట్ గా, చేర్యాల ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా దాదాపుగా నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో కులమత బేధాలు లేకుండా పరిచయాలు, బంధుత్వాలు ఉన్నాయని అన్ని వర్గాలతో మమేకమవుతూ వారు చేసిన అభివృద్ధి పనులు, కార్యక్రమాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయంటూ గుర్తుచేశారు.

- Advertisement -

సమితి ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలో పేద బడుగు బలహీన వర్గాలకు అసైన్డ్ భూమిని ప్రభుత్వం తరఫున ఇప్పించి నియోజకవర్గం లో ఎస్సీ, బీసీ కాలనీలు ఏర్పాటుచేసి రోడ్ల సదుపాయాలు, మౌలిక వసతుల కోసం తీవ్రంగా కృషి చేశారన్నారు. ప్రతి ఒక్కరు ఆత్మగౌరవంతో ఉండాలని ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపారన్నారు. నియోజకవర్గంలో అనేక మందిని రాజకీయ నాయకులను తయారు చేసిన చరిత్ర నాగపురి రాజలింగందని తన జీవితాంతం బహుజనుల అభివృద్ధికి కృషిచేసారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత చారిత్రాత్మకమైన కొమురవెల్లి దేవాలయ చైర్మన్ గా ఒక దళిత బిడ్డను నియమించారని గుర్తుచేశారు. అనేకమంది బడుగు బలహీన వర్గాల వ్యక్తులను రాజకీయంగా ప్రోత్సహించారు. తన సుదీర్ఘ 50 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏనాడు చిన్న అవినీతి మరక కూడా తనకు లేదని మా మాతృమూర్తి దివంగత నాగపురి వీరలక్ష్మి ఈ ప్రాంతానికి అన్నపూర్ణగా పేరు తెచ్చుకున్నారు. వారు కూడా ఈ ప్రాంతానికి ఎనలేని సేవ చేశారని నక్సలైట్ల ఉద్యమం ఉదృతంగా సాగుతున్న తరుణంలో అనేక మందికి ఆశ్రయం కల్పించి అన్నం పెట్టి అన్నపూర్ణగా పేరు సంపాదించుకుంది వారికి రక్షణగా నిలిచి అండగా ఉన్నారు.ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన కలిగి ఉన్న వ్యక్తి నాగపురి రాజలింగం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అప్పటి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపు కోసం కృషి చేసామని, తదనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు ఎమ్మెల్సీ హోదాలో కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో చేశారన్నారు. ఆ రోజుల్లో మాతోపాటు చేరిన మిగతా ఎమ్మెల్సీలకు మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని, ఎమ్మెల్సీగా హామీ ఇచ్చినా, మాకు అవకాశం రానప్పటికీ ఏ విధమైన పదవులు మా నాన్నకో, నాకో పదవులు రానప్పటికీ పార్టీ నియమ నిబంధనలకు లోబడి ఏ ఒక్క రోజు కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయ లేదన్నారు. గత రెండు సంవత్సరాలుగా వ్యక్తిగతంగా చనిపోయిన అనేకమంది పేద కుటుంబాలకు కోట్లాది రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబాలకు చేదోడుగా నిలిచామన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు గూడు కోల్పోయిన అనేకమంది వద్దకు వెళ్లి పరామర్శించి ఆర్థిక సహాయం అందించమన్నారు. వివిధ కార్యక్రమాల ద్వారా నిత్యం నియోజవర్గం అంతట తిరిగి ప్రజల మనిషిగా పేరు పొందామని ప్రస్తుత పరిస్థితులలో జనగామ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిత్వం గందరగోళమైన పరిస్థితి నెలకొనడం పార్టీ క్యాడర్ అయోమయంలో ఉన్నదని ప్రజలందరూ స్థానిక నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు.బలహీన వర్గాలకు అవకాశం రావాలని నియోజవర్గంలో పెద్ద మొత్తంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలు తన వర్గాల నుంచి ఒక వ్యక్తికి అవకాశం రావాలని బలంగా కోరుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులలో వర్గాల వారిగా విడిపోయి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజలలో పార్టీపై విశ్వాసం సన్నగిలే విధంగా ప్రవర్తిస్తున్నారు.ఈ సందర్భంగా మా పైన తీవ్రఒత్తిడి ఉన్నప్పటికీ పార్టీ లైన్ దాటకుండా, క్రమశిక్షణ మేరకు ఉన్నానని పార్టీని గందరగోల పరిస్థితిలో నెట్టి వేయొద్దని ఇప్పటివరకు ఏలాంటి వ్యాఖ్యలు, బహిరంగ ప్రదర్శనలు చేయలేదని ముఖ్యమంత్రికి జనగామ నియోజకవర్గ మీద పూర్తి అవగాహన ఉన్నందున సంయమనంతో అందరూ వ్యవహరించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News