ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే స్థానికేతరుడు తరచు కబ్జాలకు పాల్పడుతున్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి లాంటి వారికి కాకుండా స్థానికంగా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి స్థానికులకు టిక్కెట్టు కేటంచి ప్రోత్సహిస్తే బాగుంటుందని హై కమాండ్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని స్థానికుడు మాజీ ఆప్కో చైర్మన్ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మండల శ్రీరాములు విజ్ఞప్తి చేశారు. చేర్యాలలోని కళ్యాణి గార్డెన్సులో స్థానిక నేతనైన తనకు జనగామ ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తల సన్నాహాక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు మండల శ్రీరాములు మాట్లాడుతూ ముత్తిరెడ్డి ఎమ్మెల్యే అయ్యాక జనగామ నియోజకవర్గంలో కబ్జాలు హత్యలు పెరిగాయన్నారు.
ముత్తిరెడ్డిని ప్రజలు త్వరలోనే తరిమి కొడతారు: ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు
జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ స్థానికులకు ఇవ్వాలని టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మండల శ్రీరాములు అన్నారు. భారీ వర్షం పడుతున్న లెక్కచేయకుండా మండల శ్రీరాములు అభిమానులు భారీ సమూహంతో డప్పు చప్పులతో, కోలాటాలతో సమావేశానికి తరలివచ్చారు. చేర్యాల పాత నియోజకవర్గానికి చెందిన బీసీ నేతలు భారీ సంఖ్యలో తరలివచ్చి మండల శ్రీరాములుకి టికెట్ ఇవ్వాలని సమావేశంలో డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ మూడవసారి అధికారం చేపట్టి ముఖ్యమంత్రి కావాలంటే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి లాంటి ప్రాంతీయేతరుడికి టికెట్ కేటాయించవద్దని స్థానికుల మాత్రమే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ముత్తిరెడ్డి కి చేర్యాల ప్రాంతం మీద అవగాహన లేదు… మండల శ్రీరాములు
స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి చేర్యాల ప్రాంతం పైన ఏమాత్రం అవగాహన లేదని అవగాహన రాహిత్యంతోనే చేర్యాల, జనగామ ప్రాంతాలలో భూములు కబ్జా చేస్తున్నాడని, త్వరలోనే నియోజకవర్గ ప్రజలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని తరిమికొడతారని మండల శ్రీరాములు అన్నారు. గతంలో చేర్యాల నియోజకవర్గంలో ఎంతోమంది ఎమ్మెల్యేలుగా పని చేశారని వారు ఎవరు కూడా భూకబ్జాలకు పాల్పడలేదని స్థానికేత్రుడు కాబట్టే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రజలను దోచుకుంటున్నాడని అన్నారు.
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నియోజకవర్గం వీడాలి…
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మూడవసారి టిఆర్ఎస్ పార్టీని గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే జనగామ నియోజకవర్గ ద్రోహి అయినా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జనగామ నియోజకవర్గాన్ని విడాలని,ప్రజలు తరిమికొట్టడానికంటే ముందే నియోజకవర్గాన్ని విడాలని, భూకబ్జాదారుడు,దౌర్జన్యంగా ప్రజల భూములు లాక్కునే వ్యక్తి ఎమ్మెల్యే కావడం జనగామ ప్రజల దురదృష్టమని,జనగామ ప్రాంత ప్రజలు ముత్తిరెడ్డి అరాచకాలను గమనిస్తున్నారని మండల శ్రీరాములు అన్నారు.ప్రజల తరిమి కొట్టడానికంటే ముందే తక్షణమే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నియోజకవర్గం విడాలని డిమాండ్ చేశారు.
బీసీ నేతను, ఈ ప్రాంత బిడ్డను… మండల శ్రీరాములు
బడుగు బలహీన వర్గాలకు చెందిన నేతను,చేర్యాల ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం తపించే వ్యక్తిగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ నీ జనగామ నియోజకవర్గ టికెట్ స్థానిక నేతనైన తనకే కేటాయించాలని,ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టికెట్ కేటాయిస్తే ప్రతిపక్షాలకు ఆకాశం ఇచ్చిన వారిమవుతామని,సర్వేలు నిర్వహించి సర్వేలో ప్రజల గుండెల్లో ఎవరు ఉంటే నియోజకవర్గ ప్రజలు పట్టం కడతారో వారికే టికెట్ కేటాయించాలని మండల శ్రీరాములు డిమాండ్ చేశారు.