ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డి పల్లెకు చెందిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు. గతంలో దుండగుల కాల్పుల్లో మరణించిన జవాన్ యాదయ్య భార్య సుమతమ్మకు ఉద్యోగంతో పాటు కుటుంబానికి ఐదు ఎకరాల భూమిని కేటాయించింది రేవంత్ ప్రభుత్వం. ఈ సందర్బంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు.
- Advertisement -
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో గల్ఫ్ మృతుల బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని అందించడాన్ని హర్షిస్తూ గల్ఫ్ సంఘాల పక్షాన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ వినోద్ కుమార్, ఈరవత్రి అనిల్ తదితరులు.