Thursday, June 27, 2024
Homeపాలిటిక్స్Jeevan Reddy: హామీల అమలుకు 5 ఏళ్ల టైముంది

Jeevan Reddy: హామీల అమలుకు 5 ఏళ్ల టైముంది

అప్పుల్లో నెట్టి డిమాండ్లు చేస్తారా?

ఎన్నికల హామీలు అమలు చేయటానికి ఇంకా 5 ఏళ్ల సమయముందని సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. పదేండ్లు యువత జీవితాలతో బిఆర్ఎస్ పార్టీ చెలగాటం ఆడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయడం brs పార్టీకి ఇష్టం లేదా హరీష్ రావు చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదని ఆయన భగ్గుమన్నారు.

- Advertisement -

నోటిఫికేషన్ లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఉంటాయి. ఇష్టానుసారం మార్చడానికి ఉండదని, ఆరు నెలలో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసామని ఆయన వివరించారు. కెసీఆర్ నిర్ణయంతో విద్యుత్ శాఖ పై 40,000 కోట్ల ఆర్థిక భారం పడిందని, కమిషన్ ల కోసం కక్కుర్తి పడి ఎక్కువ పైసలు పెట్టి విద్యుత్ కొనుగోలు చేశారని ఆరోపించారు.

యాదాద్రి పవర్ ప్లాంట్ భారం అవుతుందని అప్పుడే చెప్పాము అప్పటి ప్రభుత్వం వినలేదని, బొగ్గు ఉత్పత్తి అయ్యే చోట పవర్ ప్లాంట్ లు పెట్టాలి కానీ దామర చర్ల లో ఎందుకు పవర్ ప్లాంట్ పెట్టారన్నారు. విద్యుత్ శాఖలో జరిగిన అవినీతి కేసీఆర్ మెడకు చుట్టుకుంటుoది అందుకే హరీష్ రావు టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడని, రాష్ట్రాన్ని మొత్తం అప్పుల్లో నెట్టి ఇప్పుడు పనులు చేయండి చెయ్యండి అంటే ఎట్లా అని జీవన్ రెడ్డి నిలదీశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News