Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Karimnagar: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు

Karimnagar: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు

'వెలిచాల' గెలుపే లక్ష్యంగా మంత్రి పొన్నం వ్యూహరచన

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్రావును ప్రకటించడంతో గత కొన్ని రోజులుగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశమై కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల పేరును ప్రకటించడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సఫలీకృతమయ్యారు. రెడ్డి, వెలమ, బీసీ సామాజికవర్గాలకు చెందిన అభ్యర్ధులలో ఎవరికి అవకాశం కట్టబెట్టాలన్న విషయంలో పలు సర్వేలు, అభిప్రాయ సేకరణ చేస్తూ తర్జనభర్జన పడ్డ కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం చివరికి వెలిచాల రాజేందర్ రావు కే అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టాలని నిర్ణయం తీసుకుంది

- Advertisement -

మంత్రి పొన్నం ప్రభాకర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలతో కలిసి వెలిచాల రాజేందర్రావుకే టికెట్ ఇవ్వాలని కోరుతూ ప్రతిపాదన చేశాడు. అనూహ్యంగా తీన్మార్ మల్లన్న పేరు తెరపైకి వచ్చి జోరుగా చర్చ సాగినా చివరకు మంత్రి పొన్నం ప్రతిపాదన వైపే కాంగ్రెస్ పెద్దలు మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాడానో ముర్షీ, సహ ఇన్చార్జి రోహిత్ చౌదరి కూడా వెలిచాల రాజేందర్రావు అభ్యర్థిత్వానికి ఓకే చెప్పారు. వెలిచాల రాజేందర్ రావుకు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో రాష్ట్రంలో వెలను సామాజికవర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక స్థానం కేటాయించినట్లు చర్చ జరుగుతుంది.

✳️ ఈ నెల రెండు నుండి ప్రచారానికి సర్వం సిద్ధం…
కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ను అధిష్టానం నియమించడంతో వెలిచాల అభ్యర్థిత్వం అప్పుడే దాదాపుగా ఖరారు అయింది. మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనతో ఈనెల 2 నుండి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు వెలిచాల రాజేందర్ రావు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఏయే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏయే రోజు ప్రచారం నిర్వహించాలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగనున్నారు.
✳️ వెలిచాలను ఎంపీ అభ్యర్థిగా గెలిపించే బాధ్యతను తీసుకున్న మంత్రి పొన్నం…
గతంలో కరీంనగర్ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ వెలిచాల రాజేందర్రావును ఎంపీగా గెలిపించే బాధ్యతను తీసుకున్నారు. అధిష్టానం సైతం పొన్నం మీద ఉన్న నమ్మకంతో వెలిచాలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా టికెట్ కేటాయించడంతో ఇక గెలుపే లక్ష్యంగా పొన్నం సైతం పావులు కదిపేందుకు సిద్ధమవుతున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను, కార్యకర్తలను కొత్తగా పార్టీలో చేరుతున్న ఇతర ఇతర పార్టీల నాయకులను సమన్వయం చేస్తూ రాజేందర్రావుతోపాటు మంత్రి పొన్నం కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

✳️ తండ్రి అడుగుజాడల్లోనే తనయుడు…
వెలిచాల రాజేందర్ రావు తండ్రి జగపతిరావు కరీంనగర్ ఎమ్మెల్యేగా గతంలో పని చేశారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజేందర్రావు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే అయినా ఆయన 2006లో ప్రజారాజ్యం పార్టీ నుంచి కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పోటీచేశారు. ఆ తర్వాత ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో బీఆర్ఎస్ కు దూరమై మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News