Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Karimnagar: అరికెపూడికి కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి

Karimnagar: అరికెపూడికి కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి

లేకపోతే బీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలి..

బతకడానికి వచ్చినవ్ నీవేంది అంటూ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని కించపరిచిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ చేశారు. కరీంనగర్లో వెలిచాల రాజేందర్ రావు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

- Advertisement -

ఎమ్మెల్యే అరికెపుడి గాంధీపై పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీకి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేకపోతే, బీఆర్ఎస్ పార్టీ నుంచి పాడిని సస్పెండ్ చేయాలని సూచించారు. చిల్లర మల్లరగా వ్యవహరిస్తున్న పాడి కౌశిక్ ను పార్టీలో ఉంచుకుంటే మరింత నష్టపోవడం ఖాయమని హితవు పలికారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో హైదరాబాద్ కు బతకడానికి వచ్చిన వాళ్ళందరూ మన వాళ్లేనని చెప్పిన విషయం మర్చిపోయారా.. కౌశిక్ అని ప్రశ్నించారు. వారి కాళ్లకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని కెసిఆర్ మాట్లాడిన విషయం మర్చిపోయారా.. కౌశిక్ అని మండిపడ్డారు. అరికెపూడి గాంధీని బతకడానికి వచ్చినవని నీవే స్వతహాగా వాక్యాలు చేశావా.. లేకుంటే కెసిఆర్ వెనక ఉండి నిన్ను మాట్లాడించారా.. ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బతకడానికి వచ్చిన వారు ఓట్లు వేస్తేనే హైదరాబాదులో బిఆర్ఎస్ కు సీట్లు వచ్చాయని, అలాంటప్పుడు కించపరిచినట్లు మాట్లాడితే ఇది ఎంత వరకు కరెక్ట్ అని పేర్కొన్నారు.

కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలకు చీరెలు, గాజులు పంపిస్తున్నానని ఫోటోలకు ఫోజులు ఇచ్చిన పాడి కౌశిక్ రెడ్డి మహిళా మణులంటే అంత చులకన భావం ఎందుకని మండిపడ్డారు. సమాజంలో మహిళలకు ఉన్నతమైన గౌరవం ఉందని, అలాంటి వారిని కించపరచడం నీచ సంస్కృతి కాదా .. కౌశిక్ అని ప్రశ్నించారు.
నీ రాజకీయమంతా వివాదాస్పదమేనని, ఎవరిని లెక్క చేయకుండా ఇష్ట రాజ్యాంగా మాట్లాడడం, ప్రవర్తించడం నీకు నిత్యం అలవాటైందని విమర్శించారు. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు నడిపిస్తున్న రాజకీయ పావులో బలి కాకుండా చూసుకోవాలని హితవు పలికారు. ఇకనైనా చిల్లర మల్లరగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేలపై మాట్లాడడం బంద్ చేయాలని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News