Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Karimnagar: వెలిచాలకే మా ఓటు

Karimnagar: వెలిచాలకే మా ఓటు

ఏకగ్రీవ తీర్మానం

పార్లమెంటు ఎలక్షన్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి తమ కుల సంఘం అండగా ఉంటుందని నేతకాని కులస్తులు హామీ ఇచ్చారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా క్రీ. శే. వెలిచాల జగపతిరావు కుమారుడు వెలిచాల రాజేందర్ రావు బరిలో నిలవడంతో తన స్వగ్రామమైన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలోని నేతకాని సంగం నాయకులు వెలిచాల రాజేందర్ రావుకు మా కుటుంబ సభ్యులందరమూ ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపై ఓటు వేస్తామని తీర్మానం చేసి వారి తమ్ముడు అయిన వెలిచాల నీశాంతు రావుకు అందచేశారు.

- Advertisement -

ఈ సందర్బంగా నిశాంత్ మాట్లాడుతూ.. ఉన్న ఊరు కన్న తల్లి లాంటిదని క్రీ. శే.జాగపతిరావు ఈ గ్రామానికే కాకుండా జిల్లాకు కూడా ఎనలేని సెవలు చేసారని, ఇప్పుడు రాజేందర్ రావు కూడా అందరికీ సేవ చేయడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. నేతకాని సంఘం వారు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం అభినందనీయం అన్నారు.

ఈ కార్యక్రమంలో కులసంఘ నాయకులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News