Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Karnataka: ఇక ఎన్నికల్లో పోటీ చేయను..కానీ..: యడ్యూరప్ప

Karnataka: ఇక ఎన్నికల్లో పోటీ చేయను..కానీ..: యడ్యూరప్ప

తాను ప్రత్యక్ష ఎన్నికల్లో ఇకమీదట పోటీ చేయనంటూ కర్నాటక బీజేపీ అగ్రనేత, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాను బరిలోకి దిగటం లేదంటూ ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. ఇదంతా వ్యూహాత్మకమా లేక సొంత పార్టీని ఇరుకున పెట్టి, తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవటమా అంటూ రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కాగా పార్టీ కోసం తాను రాష్ట్రమంతా పర్యటించి, ప్రచారాన్ని చేపడతానని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు తాను సర్వం ఒడ్డుతానని యడ్డి చెప్పారు.

- Advertisement -

ఇప్పటికే తాను ఎమ్మెల్యేగా, సీఎంగా రాజీనామా చేసినట్టు, తాను 80 ఏళ్ల వయసులో ఉన్నట్టు.. పార్టీని బలంగా నిర్మిస్తానని ఆయన మీడియాకు వెల్లడించారు. కాగా తన కుమారుడు రాఘవేంద్రకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదంటూ బీజేపీ హైకమాండ్ చెప్పిన నేపథ్యంలో అలిగిన అప్ప అప్పటినుంచీ పార్టీపై, మోడీపై గుర్రుగా ఉంటున్నారు. యడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు మెట్టు దిగిన హైకమాండ్.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి మళ్లీ వస్తే ప్రభుత్వంలో కీలక బాధ్యతలను రాఘవేంద్రకు అప్పగిస్తామని యడ్యూరప్పకు పార్టీ హామీ ఇచ్చింది. ఈ హామీ తరువాత కూడా యడ్డి మెత్తబడకపోవటం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News