Sunday, November 16, 2025
Homeపాలిటిక్స్Khammam: కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ YSRTP ఆత్మీయ సమ్మేళనం

Khammam: కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ YSRTP ఆత్మీయ సమ్మేళనం

షర్మిలకు శీనన్న థాంక్స్

ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలో కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ తెలంగాణ పార్టీ మద్దతు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్స్…వైఎస్ షర్మిల తెలంగాణాలో పార్టీ పెట్టి మూడున్నరవేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నిరుద్యోగులకు అండగా దీక్ష చేసి ప్రజలను చైతన్య వంతం చేసిన దాంట్లో వారి పాత్ర పోషించారు..ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలొద్దని, కాంగ్రెస్ కు నష్టం జరగొద్దని మంచి మనసుతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం హర్షించ దగ్గ విషయమని శీనన్న అన్నారు. ఒక రాజకీయ నాయకుడు పక్క పార్టీ గురించి, పక్క నాయకుడి మంచి గురించో ఆలోచించని ఈరోజుల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని షర్మిల ఆలోచించారన్నారు. ఏ ఉద్దేశ్యంతో అయితే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టామో ఆ ఉద్దేశ్యం నెరవేరదని గ్రహించి మాకు మద్దతు తెలిపినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలని పొంగులేటి అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad