Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Kisara: మంత్రి మల్లారెడ్డిపై నక్కా ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

Kisara: మంత్రి మల్లారెడ్డిపై నక్కా ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

చెరువులు, కుంటలన్నీ మంత్రి కబ్జాల్లో..

బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, కుల సంఘాల తోటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలోని బొమ్మరాసిపేట్ గ్రామంలో తన వ్యవసాయ క్షేత్రంలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నక్క ప్రభాకర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. మేడ్చల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ టికెట్ మంత్రి మల్లారెడ్డికి కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, మంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

మంత్రి మల్లారెడ్డికి బీఆర్‌ఎస్ టికెటిస్తే మేడ్చల్‌లో బిఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్ అన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చెరువులు, కుంటలు కనిపించినా మంత్రి మల్లారెడ్డి కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ మరోసారి ఆలోచించి మంత్రి మల్లారెడ్డిని మేడ్చల్‌ నుంచి పోటీ చేయనీయకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాపోలు రాములు, శంకర్, నరసింహ, ఈశ్వర్, శ్రీనివాస్, శివలింగాల శ్రీనివాస్ గౌడ్, దుబ్బ రామస్వామి, జంగయ్య యాదవ్, మున్సిపల్ ప్రెసిడెంట్ లు, మాజీ సర్పంచ్లు, వార్డ్ మెంబర్ లు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News