Sunday, December 8, 2024
Homeపాలిటిక్స్Kodangal: కొడంగల్ లో ఏం జరుగుతోంది?

Kodangal: కొడంగల్ లో ఏం జరుగుతోంది?

కొడంగల్ లో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి..

కొడంగల్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బాలకిషన్ యాదవ్ తన నామినేషన్ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. కేటీఆర్ బాలకిషన్ యాదవ్ కు గులాబి కండువ కప్పి స్వాగతం పలికారు.
దుద్యాల మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన బాలకిషన్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొడంగల్ ప్రజలకు సేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని అయితే సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో సాగుతున్న అభివృద్ధి కొడంగల్ లో ప్రజల కోసం ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి తపిస్తున్న వైనం చూసి ఆకర్షితుల్ని తన నామినేషన్ ఉపసంహరించుకొని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు.

- Advertisement -


దుద్యాల మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన రోజు బాలకృష్ణ యాదవ్ టిఆర్ఎస్ పార్టీలో చేరడం చర్చినీయాంశమైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News