Saturday, July 27, 2024
Homeఓపన్ పేజ్Indian army tremendous services: అసమానాలు, సరిహద్దు సైనికుల సేవలు

Indian army tremendous services: అసమానాలు, సరిహద్దు సైనికుల సేవలు

దేశ రక్షణతో పాటు ప్రకృతి విపత్తుల్లోనే సైన్యం సేవలు అపారం

భారత దేశ ప్రజలు అనుక్షణం ప్రశాంత జీవనం గడుపుతూ సంతోషంగా ఉన్నారంటే కారణం భారత సైనికులు ఇరవై నాలుగు గంటలు సరిహద్దుల్లో దేశానికి కాపలా కాస్తూ ఎడారి ఎండల్ని, మంచుకొండల మంచును, నిరంతరం కురిసే వర్షాలను లెక్క చేయకుండా దేశ రక్షణలో ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి ఉండడం వల్ల మాత్రమే. కోట్లాది భారతీ యుల కోసం తమ కుటుంబాలకు దూరంగా మంచు కొండల్లో, ఎముకలు కొరికే చలిలో విధులు నిర్వర్తిస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపలా కాస్తూ, కేవలం దేశరక్షణకే పరిమితం కాకుండా వరదలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల రక్షణలోనూ ముందుంటున్న మన సైనికుల రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవడం సాధ్యం..

- Advertisement -

దేశానికి అన్నం పెట్టేది రైతన్న అయితే, దేశాన్ని కాపాడేది సైనికుడు. అందులోనూ త్యాగానికి ప్రతీక సైనికుడు. అందుకే “జై జవాన్, ఆ తరువాత జై కిసాన్” దని అని దేశ మలి ప్రధాని లాల్ బహదూర్ లాంటి పెద్దలు అన్నారు. దేశసేవ కోసం ఎంతో మంది సైనికులు సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్నారు.
సైనికులలో మూడు బృందాలుండేవి. మద్రాస్ శాపర్స్, బెంగాల్ శాపర్స్, బాంబే శాపర్స్ ఉండగా 1932 నవంబర్ 18న వీటిని విలీనం చేశారు. అప్పటి నుంచి వీరి అత్యున్నత సేవలు చరిత్రలో భాగమయ్యాయి. అటు యుద్ధ సమయం లోనూ, ఇటు శాంతి సమయాల లోనూ వీరి సేవలు అసమానంగా సాగుతూ వస్తున్నాయి.

భారతీయ సైన్యం చరిత్ర కొన్ని వేల సంవత్సరాలకు పైబడిందే. మహాభారత కాలాల్లో కురుక్షేత్ర సంగ్రామంలో లక్షలాది మంది యుద్ధంలో పాల్గొన్నారు. రధాలు, గుర్రాలు, ఏనుగులపై నుంచి యుద్ధం సాగించడమే కాకుండా నేలపై నుంచి కూడా యుద్ధం చేసారు. అప్పట్లో విశ్వశాంతి, ధర్మ పరిరక్షణల కోసం అనేక యుద్ధాలు జరిగాయి. క్రమక్రమంగా రాజ్య విస్తరణ కాంక్షతో, నాగరికత పెరిగే కొద్దీ వాయవ్య దిశగా హిందూకుష్ పర్వతాల ద్వారా చొరబాట్లు పెరిగాయి. ఎన్నో శతాబ్దాల పాటు అక్కడ పర్యవేక్షణ లేదు. ఆ తరువాత చొరబాట్లకు అనేక మార్గాలు ఏర్పడ్డాయి. వీటిని ఎదుర్కొనేందుకు ఆయా ప్రదేశాల రాజ్యాధినేతలు యుద్ధాలు చేయాల్సి వచ్చేది. స్వదేశీ తెగల్లోని సైన్యం ప్రధాన ఆయుధాలు విల్లు, బాణాలు. ఆనాటి యుద్ధ కారణాలు పరిమితంగా ఉండేవి. మనుగడ, చొరబాట్లకు సంబంధించినవే ఎక్కువ. భారతీయ రాజకీయ చరిత్రలో చెపుకోదగ్గ తొలి చొరబాటు క్రీ.పూ.327 లో అలెగ్జాండర్ అధ్వర్యంలో గ్రీకులది.

ప్రాచీన భారతీయ సాహిత్యంలో రాజకీయాల్లో యుద్ధాల ప్రస్తావనలు ప్రముఖంగా కనిపిస్తాయి చంద్రగుప్త మౌర్యులు కాలంలోని సైన్యాన్ని ఈ సందర్భముగా ప్రస్తావనార్హం. ఆనాటి సైనిక చరిత్రకు అర్ధశాస్త్రం ప్రామాణికం లాంటిది. కళింగ రాజుల కాలంలో యుద్ధభూమిలోకి ఏనుగులు వచ్చాయి. ఇవి 17 వ శతాబ్దిదాకా సాగాయి. మౌర్యుల కాలంలో శాంతి స్థాపన జరిగినది. గుప్తుల కాలం లో మన దేశానికి ప్రపంచ గుర్తింపు లభించినది. ఈ విధంగా రాజ్యాల రక్షణ కోసం సైన్యము సైనిక అవసరాలు కలిగాయి.

స్వాతంత్ర్యం సాధించుకున్నాక, స్వతంత్ర రాజ్యమైన కాశ్మీర్‌ మహారాజు ఇటు భారత దేశంలో లేదా అటు పాకిస్తాన్‌లో విలీనానికి అంగీకరించలేదు. ఈ కారణంగా పాకిస్తాన్ కొంతమంది చొరబాటు దారులను కాశ్మీరుకు పంపి ఊళ్ళను ఆక్రమించుకో సాగింది. మరి కొద్దిరోజులను తన సైన్యాన్ని పంపి కాశ్మీరును ఆక్రమించు కోవడానికి ప్రయత్నిస్తున్నపుడు మహారాజు భారత ప్రభుత్వాన్ని శరణు కోరి భారత దేశంలో కాశ్మీర్‌ను విలీనం చేయడానికి అంగీకరించి ఒప్పందం చేసాడు. అప్పుడు భారత ప్రభుత్వం జనరల్ తిమ్మయ్య నేతృత్వంలో సైన్యాన్ని పంపి పాకిస్తాన్ సైన్యాన్ని కాశ్మీర్‌ నుండి వెళ్ళగొట్టే చర్యలుచేపట్టింది. ఆ సమయంలో ఐక్యరాజ్య సమితి రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రారంభించి సరిహద్దు రేఖను నిర్ణయించడంతో వివాదానికి తెరపడింది.

తర్వాత… బ్రిటీష్, ఫ్రెంచ్ సైన్యాలు భారత దేశాన్ని విడిచి వెళ్ళినా, పోర్చుగీసు సైన్యం విడిచి వెళ్ళక గోవా, డామన్ డయ్యులను తన ఆధీనంలో ఉంచుకుంది. పోర్చుగీస్ అధికారులు చర్చలకు అంగీక రించక పోవడంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ పేరుతో సైన్యాన్ని పంపింది. భారత సైన్యాన్ని తట్టుకోలేక పోర్చుగల్ దేశం భారతదేశంతో సంధికి ఒప్పుకొని అన్ని ప్రాంతాలను విడిచి వెళ్ళేందుకు అంగీకరించింది.

చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో సైన్యం అంతులేని సాహసాలు ప్రదర్శించారు. కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ కు మద్దతు ఇస్తారు అన్న అపోహలతో 1965లో పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ తన సైన్యాన్ని పంపి కాశ్మీర్‌ను కొంత మేరకు ఆక్రమించు కున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యుద్ధంలోనే అత్యధికంగా యుద్ధ ట్యాంకులను ఉపయోగించారు. భారత ఆర్మీ హోరాహోరీగా పోరాడి అందుబాటులో ఉన్న యుద్ధం ట్యాంకులన్నీ వినియోగించి పాక్ సైన్యానికి తానేమిటో చూపెట్టింది. భారత్ 128 ట్యాంకులను నష్టపోయింది. 150 పాక్ ట్యాంకులను ధ్వంసం చేసి 152 ట్యాంకులను చేజిక్కించుకొంది. తాష్కెంట్‌లో లాల్ బహదూర్ శాస్త్రి – అయూబ్ ఖాన్‌ల మధ్య జరిగిన సంధితో ఈ యుద్ధం ముగిసింది.

1971లో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) లో జరిగిన తిరుగు బాటుతో దాదాపు కోటి మంది శరణార్థులు భారత దేశానికి రావడంతో భారత్-పాక్ యుద్ధం మొదలయింది. తూర్పు పాకిస్తాన్‌కు పశ్చిమ పాకిస్తాన్ నుండి విమోచన కల్పించడం భారత్‌కు అన్ని విధాలా శ్రేయస్కర మయింది. తన బలగాలన్నిటినీ పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్) వైపే గురి పెట్టగలిగింది. భారత సైన్యం జనరల్ అరోరా నేతృత్వంలో పాక్ సైన్యాన్ని లాహోర్ వరకు తరిమి కొట్టి 90వేల యుద్ధ ఖైదీలను పట్టుకొంది. పాక్ ఓటమిని అంగీకరించడంతో ఈ యుద్ధం ముగిసింది.

1999లో పాకిస్తాన్ తన సైన్యాన్ని పంపి తీవ్రవాదులతో కలసి ఆ ప్రాంతాలు ఆక్రమించుకుంది. నెమ్మదిగా కీలకమయిన బటాలిక్, ద్రాస్, టైగర్ హిల్‌లను ఆక్రమించు కోవడంతో భారత్ 2లక్షల మంది సైన్యాన్ని సిద్దం చేసింది. కార్గిల్ యుద్ధం జరుగుతున్న ప్రాంతాల కున్న పరిమితులవల్ల 30వేల మంది మాత్రమే పాల్గొన్నారు. సైన్యం అనేక కీలక పర్వతాలలో, చెక్ పోస్టుల వద్ద ఉన్న తీవ్రవాదులను సమర్థవంతంగా ఎదుర్కొని రెండు నెలల్లో అన్నింటినీ స్వాధీనం చేసుకుంది. ఇలా భారత సరిహద్దు లలో సైన్యం అంతులేని ధైర్య సాహసాలు ప్రదర్శిస్తు, సకల త్యాగాలకు సిద్ధపడి, ప్రాణాలను పణంగా పెట్టి అనుక్షణ అప్రమత్తులై దేశ రక్షణ చేస్తున్నారు.

రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News