Tuesday, September 17, 2024
Homeపాలిటిక్స్Kondareddypally complete Solar powered village: రాష్ట్రంలో పూర్తి స్థాయి సోలరైజ్డ్ గ్రామంగా కొండారెడ్డి...

Kondareddypally complete Solar powered village: రాష్ట్రంలో పూర్తి స్థాయి సోలరైజ్డ్ గ్రామంగా కొండారెడ్డి పల్లి

సీఎం ఆదేశాల మేరకు..

ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అదేశానుసారం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్ గా చేయుటకు ప్రక్రియ మొదలైంది.

- Advertisement -

ఈ క్రమంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖి ఐఏఎస్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, బి సంతోష్ ఐఏఎస్, రెడ్కో VC & MD, అనిల, సంస్థ డైరెక్టర్ కమెర్షియల్, కే రాములు, ఇతర శాఖల ముఖ్య అధికారులతో కలిసి కొండారెడ్డిపల్లి గ్రామంలో పర్యటిస్తూ పలువురు గ్రామస్తులతో, రైతులతో, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ ఈ పైలట్ ప్రాజెక్ట్ వివరాలు తెలియజేశారు.

గ్రామంలో దాదాపు 499 గృహ వినియోగదారులు, 66 వాణిజ్య వినియోగదారులు, 867 వ్యవసాయ వినియోగదారులు, ఇతర కాటగిరీలతో కలుపుకుని మొత్తం 1451 వినియోగదారులు వున్నారు.

ఈ మోడల్ ప్రాజెక్ట్ అమలు చేయుట కొరకై ఈ రోజు నుండి గ్రామంలో ఇంటింటి సర్వే మొదలుపెట్టారు. ఈ సర్వే ద్వారా గ్రామానికి అవసరమైన సౌర విద్యుత్ కెపాసిటీని అంచనా వేసి DPR తదుపరి ప్రక్రియ జరగనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News