Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Korutla: కోరుట్ల కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేనా?

Korutla: కోరుట్ల కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేనా?

అయోమయంలో కాంగ్రెస్ క్యాడర్

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కోరుట్ల కాంగ్రెస్ లో టికెట్ వేడి ఎక్కువైతుంది.. లీడర్లు తమ క్యాడర్ తో టికెట్ మనకే అంటూ చెబుతున్నారు.. బీఆర్ యస్ పార్టీ అభ్యర్థి ప్రకటించినప్పటి నుండి కాంగ్రెస్ లో టికెట్ లొల్లి ఎక్కువయ్యింది.. కాంగ్రెస్ పార్టీ టికెట్ తమకంటే తమకని కాంగ్రెస్ లోని నాయకులు చెబుతున్నారు. నియోజకవర్గంలో నాలుగు వర్గాలు ఉండటంతో టికెట్ ఎవరికి వస్తుందో అని అయోమయంలో క్యాడర్ ఉంది. ఒక వర్గమంటే మరో వర్గానికి పడటం లేదు. కొద్దిరోజుల క్రితం కోరుట్ల పట్టణంలో నియోజకవర్గ నాయకుల, కార్యకర్తల సమావేశానికి వచ్చిన ప్రత్యేక దూత ముందే రెండు వర్గాలకు చెందిన నాయకులు బాహాబాహీకి దిగారు. ఇరు వర్గాల వాదోపవాదాలని సముదాయించేందుకు వచ్చిన ప్రత్యేక దూత, జిల్లా అధ్యక్షులు నానా తంటాలు పడ్డారు. నియోజకవర్గ కాంగ్రెస్ లో జువ్వాడి నర్సింగరావు, కల్వకుంట్ల సుజిత్ రావు, కొమిరెడ్డి కరంచంద్, కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డిలతో పాటు ఇంకొందరు పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నలుగురిలో ఒక్కరికి టికెట్ వచ్చే సూచనలు ఉన్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

- Advertisement -

జువ్వాడి నర్సింగరావు
గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. తన తండ్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు వారసుడుగా కొనసాగుతున్నాడు. ఈసారి టికెట్ తనకే లభిస్తుందని రేవంత్ రెడ్డి అండదండలతో టికెట్ తనకే లభిస్తుందని, రెండు సార్లు ఓడిన ఈసారి తప్పకుండా విజయం సాధిస్తానని నర్సింగరావు అంటున్నారు.

కల్వకుంట్ల సుజిత్ రావు
గత మూడు పర్యాయాలు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇవ్వకున్న పార్టీలో ఉంటూ పార్టీ ప్రతిష్టకు కృషి చేసానని అధిష్టానం అండదండలతో ఈసారి కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని సుజిత్ రావు అంటున్నారు. మాజీ మంత్రి శ్రీధర్ బాబు, సుజిత్ రావులు మిత్రులు కావడం, శ్రీధర్ బాబు జాతీయ కాంగ్రెస్ కార్యదర్శిగా ఉండటంతో సుజిత్ రావుకే టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తమ వర్గీయులు బహిరంగంగా చెబుతున్నారు.

కొమిరెడ్డి, కరం చంద్
దివంగత మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు వారసుడిగా కరంచంద్ రాజకీయ ప్రవేశం చేశారు. తన తండ్రికి ఉన్న పరిచయాలు తనకి కలిసివస్తాయని, ప్రతి పార్లమెంట్ లో రెండు బీసీ లకు కేటాయించాలని బీసీ నేతలు కోరడంతో బీసీ కోటలో టికెట్ తమ నాయకుడికి వస్తుందని కరంచంద్ అభిమానులు చెబుతున్నారు.

కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి
అధికార పార్టీలో ఉండి, జడ్పీటీసీగా శ్రీనివాస్ రెడ్డి భార్య రాధసేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ వైఖరి పట్ల, రైతులపై ప్రభుత్వం చూపిస్తున్న వివక్షతో బీఆర్ యస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి రాధలు చేరారు. పార్టీలోని అధిష్టానం పెద్దలతో టికెట్ తనకే వస్తుందని చెబుతున్నారు.. నలుగురు నాయకుల వర్గపోరుతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఒకరికి టికెట్ వస్తే ఇంకొకరు సపోర్ట్ చేసే అవకాశం ఉండదని బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. అధిష్టానం అందరిని సమన్వయ పరచి ఒక్కతాటికి తేవాలని అధిష్టానాన్ని కార్యకర్తలు కోరుతున్నారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఒక్కటి ఆవుతారో లేక ఎవరికివారే యమున తీరే అంటూ ఉంటారో రాబోయే రోజుల్లో తేలనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News