Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్Kotla: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పనైపోయింది

Kotla: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పనైపోయింది

జగన్ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తారు?

రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పనైపోయింది అని రానున్న రోజుల్లో తెలుగు దేశం పార్టీదే గెలుపు అని తెలుగు దేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు.. మంత్రాలయంలో చంద్రబాబుకు మద్దతుగా నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అధ్వర్యంలో 13 వ రోజు రీలే నిరహౕర దీక్షలో కురువ కులస్తులు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, తిక్కారెడ్డి, మాజీ జిల్లా పరిషత్తు చైర్మన్ బత్తిన వెంకటరాముడు మాట్లాడుతూ చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేయడం ప్రజలకు తెలుసు అని ఈ నాలుగున్నర సంవత్సరాలలో ప్రజలకు చేసింది ఏమి లేదు అని ప్రజలకు ఏమి చేశారో కూడా తెలియదు, మళ్లీ అధికారంలోకి ఎలా వస్తారు అని అన్నారు.

- Advertisement -

మంత్రాలయం నియోజకవర్గం కురువ కులస్తులు, గొరవయ్యలు చేస్తూన్న రీలే నిరహౕర దీక్షలో సంఘీభావం తెలియజేస్తూ చంద్రబాబు కడిగిన ఆణిముత్యంలా బయటికి వస్తాడు అని, వైసీపీ పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు నమ్మరు అని వారు అన్నారు.. రీలే నిరహౕర దీక్షలో పెద్దకడూబురు కురువ మల్లికార్జున, కౌతాళం కురువ వీరేష్, ఆర్లబండ బానుప్రకాష్, మాధవరం నారాయణ, కందుకూరు అయ్యన్న, నర్సరెడ్డి, రంగాపురం మహదేవ్, అన్ని గ్రామాలు కురువ కులస్తులు దీక్షలో కుర్చున్నారు… ఈ దీక్షకు మద్దతుగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప పాల్గొన్నారు.

ఈ దీక్షకు మద్దతు గా టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప , తెలుగు రైతు ప్రదాన కార్యదర్శి వెంకటపతి రాజు,జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కోట్రేష్ గౌడ్, బిసి సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, భరద్వాజ్ శేట్ట, తెలుగు యువత నియోజకవర్గం అధ్యక్షులు బాపురం సుదీర్ రెడ్డి, తదితరులు సంఘీభావం తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News