Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్KTR at Kollapur: మంత్రి జూపల్లిని బర్తరఫ్ చేయాలి, శ్రీధర్ రెడ్డి హత్యకు జూపల్లిదే...

KTR at Kollapur: మంత్రి జూపల్లిని బర్తరఫ్ చేయాలి, శ్రీధర్ రెడ్డి హత్యకు జూపల్లిదే బాధ్యత

ఫ్యాక్షన్ పాలన తెస్తున్న రేవంత్

కొల్లాపూర్ లో హత్యకు గురైన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళ్లర్పించి…కుటుంబ సభ్యులను పరామర్శించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. మాజీ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బొడ్డు శ్రీధర్ ని హత్య చేశారని, కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావుదే ఈ హత్యకు బాధ్యతన్నారు కేటీఆర్.

- Advertisement -

నియోజకవర్గంలో ఇది మొదటి హత్య కాదని, నాలుగు నెల్లోనే ఇద్దరిని హత్య చేశారని కేటీఆర్ భగ్గుమన్నారు. గతంలో మల్లేష్ యాదవ్ ను, ఇప్పుడు శ్రీధర్ రెడ్డిని హత్య చేశారని, పేరుకేమో ప్రజాపాలన. కానీ చేస్తున్నది ప్రతీకార పాలన అంటూ కేటీఆర్ ఆరోపించారు. ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు పలకని వాళ్లను ప్రతీకారం తీర్చుకునే దిక్కుమాలిన కాంగ్రెస్ పాలన ఇదని ఆయన మండిపడ్డారు. ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఈ మంత్రి ఎప్పుడు లేని విధంగా తెలంగాణలో ఫ్యాక్షన్ సంస్కృతిని తీసుకొచ్చాడని, నాలుగు నెలల్లోనే రెండు హత్యలు జరిగాయంటే కచ్చితంగా దీని వెనుక మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రోద్భలం ఉంది. లేదంటే ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా అని కేటీఆర్ అన్నారు. మాకు ఈ స్థానిక పోలీసుల మీద నమ్మకం లేదు. ఐతే సిట్ లేదంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని, నిజంగా ఇందులో ప్రభుత్వం, మంత్రి పాత్ర లేకపోతే నిష్పక్షిమైన విచారణ జరిగేందుకు ప్రభుత్వం సహకరించాలె అన్నారు.

పదిరోజుల క్రితమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా మా నాయకులు డీజీపీని కలిసి ఈ ప్రాంతంలో కొత్తగా హింసాయుత సంస్కృతిని తీసుకొస్తున్నారని చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో దాడులు చేస్తూ చెలరేగిపోతున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని పిటిషన్ ఇచ్చారని, ఈ ప్రాంతంలో పికెట్ లు, క్యాంప్ పెట్టిలు ఈ ప్రాంతాల్లో కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలని కూడా కోరారు. హత్య జరిగిన తర్వాత పది నిమిషాల్లో రావాల్సి ఉండగా గంటన్నర తర్వాత వచ్చిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారన్నారు. ముందుగా ఇక్కడ ఎస్సైని సస్పెండ్ చేయాలని, బాధ్యులైన పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మంత్రి జూపల్లి కృష్ణారావుని ముందుగా బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా అన్న కేటీఆర్, ప్రతీకారంతో మా కార్యకర్తలను హత్య చేయటం, గొంతు నొక్కటం చేస్తూ బలపడదాం అనుకుంటే అది ముఖ్యమంత్రి మూర్ఖత్వం, కాంగ్రెస్ పార్టీ పిచ్చితనం అవుతుందని హెచ్చరించారు. ఇవే దాడులు కొనసాగుతూ ఉంటే మా కార్యకర్తలను అదుపు చేయటం మాకు కూడా సాధ్యం కాదన్నారు. మాకు కూడా ఓపిక నశిస్తే జరిగే పరిణామాలకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ శ్రీధర్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News