Sunday, July 7, 2024
Homeపాలిటిక్స్KTR: 600 మందితోనే బీసీ బంధు ఆగదు

KTR: 600 మందితోనే బీసీ బంధు ఆగదు

బీసీ బంధు నిరంతర ప్రక్రియ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ మంగళవారం రోజు విస్తృతంగా పర్యటించారు. వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నమననేని రమేష్ బాబుతో కలిసి వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.అనంతరం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సిరిసిల్ల,వేములవాడ నియోజకవర్గాలలో బీసీ, ఎంబీసీ కులవృత్తులకు లక్ష రూపాయల గ్రాంట్ రూపంలో 600 మంది లబ్ధిదారులకు బీసీ బందు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గడిచిన 9 ఏళ్లలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర సంక్షేమానికి ‘స్వర్ణ యుగం’ వచ్చిందన్నారు. పుట్టినప్పుడు ఇచ్చే కేసీఆర్ కిట్టుతో మొదలుకొని పెద్ద వయసులో ఇచ్చే ఆసరా పింఛన్ల వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు.

- Advertisement -

దశాబ్దాల నుంచి శతాబ్దాల వరకు పేరుకుపోయిన పేదరికాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. అదే తరుణంలో బీసీలలో కూడా అణగారిన వర్గాల అభ్యున్నతికి 14 కులవృత్తుల వారికి బీసీ బందు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు.సిరిసిల్ల జిల్లాలో బీసీ బంధుకు పదివేల దరఖాస్తులు వస్తే 600 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు.ఈ బీసీ బంధు కేవలం 600 మందితోనే ఆగదని దశలవారీగా ప్రతి ఒక్కరికి బీసీ బందు అందుతుందని తెలిపారు. బీసీ బందు కింద చేసే ఆర్థిక సహాయం గ్రాంట్ మాత్రమేనని లబ్ధిదారులు మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.పని చేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ లాంటి నాయకుడిని మల్లీ అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి, రాష్ట్ర పవర్లుమ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, టెక్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి, రామతీర్థపు మాధవి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ఖీమ్యా నాయక్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News