తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ రైతులకు ఐదు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ఏపీ తెలంగాణను కలిపిన పాపానికి 58 ఏళ్లు తెలంగాణ బాధపడింది. ఇప్పుడు మళ్లీ ఆరు గ్యారెంటీలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. తమ పాలనలో తెలంగాణ దేశానికి అన్నపూర్ణంగా మారిందని, 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయటం, ఫ్లోరోసిస్ ను రూపుమాపడం వంటివన్నీ తమతోనే సాధ్యమయ్యాయన్నారు. యాదాద్రి అభివృద్ధి కాలేశ్వరంతో సాగునీరు ఇచ్చిన ఘనత మాదంటూ ఆయన స్పష్టంచేశారు. కేటీఆర్ మాట్లాడుతూ, తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ కేటీఆర్ అని, తెలంగాణ స్టేట్ తమ తొమ్మిదేళ్ల పరిపాలనలో కరువు, కూర్పు వంటి పరిస్థితులు లేవని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాదులో ‘మీట్ ది ప్రెస్’లో పాల్గొన్న ఆయన దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందన్నారు. తెలంగాణ అనుచరిస్తున్నది దేశం అనుసరిస్తుందని, సంపద పెంచడమే కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యం తలసరి ఆదాయంలోనే నెంబర్ వన్ గా ఉన్నామన్నారు. మా పాలనలో పల్లెలు పట్నాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఐటీ అభివృద్ధిలో 400% అభివృద్ధి సాధించామని కేటీఆర్ చెప్పారు.
KTR: కాంగ్రెస్ మోసం చేసేందుకే వస్తోంది
మీట్ ది ప్రెస్ లో కేటీఆర్